Perplexity Hybrid Compute : పెర్‌ప్లెక్సిటీ బిగ్ ఫీచర్.. డేటా ఇక క్లౌడ్‌కు వెళ్లదు.!
Perplexity Hybrid Compute : ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫారమ్ పెర్‌ప్లెక్సిటీ (Perplexity) తమ వినియోగదారుల కోసం ఒక
Perplexity Hybrid Compute
Perplexity Hybrid Compute : ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫారమ్ పెర్‌ప్లెక్సిటీ (Perplexity) తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. సమాచార భద్రత, డేటా ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ‘హైబ్రిడ్ కంప్యూట్’ (Hybrid Compute) పేరుతో ఈ అడ్వాన్స్‌డ్ సాంకేతికతను రంగంలోకి దించింది. యాపిల్ సిలికాన్ (Apple Silicon) ప్రాసెసర్లతో పనిచేసే మ్యాక్ (Mac) కంప్యూటర్లను ఉపయోగించే ప్రొఫెషనల్స్ తమ వద్ద ఉన్న అత్యంత సున్నితమైన డేటాను క్లౌడ్‌కి పంపకుండానే అత్యంత సురక్షితంగా ఏఐ సేవలను వినియోగించుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
హైబ్రిడ్ కంప్యూట్ పనితీరు , ప్రాముఖ్యత
సాధారణంగా ఏఐ మోడల్స్ ఏదైనా సమాచారాన్ని విశ్లేషించాలంటే ఆ డేటాను కంపెనీ సర్వర్లు ఉండే క్లౌడ్‌కి పంపాల్సి ఉంటుంది. అయితే పెర్‌ప్లెక్సిటీ తీసుకొచ్చిన ఈ హైబ్రిడ్ కంప్యూట్ ఫీచర్ ప్రతీ పనిని రెండుగా విభజించి ప్రాసెస్ చేస్తుంది. అత్యంత ప్రైవేట్, రక్షణాత్మక ఫైళ్లు , సున్నితమైన సమాచారాన్ని క్లౌడ్‌కి పంపకుండా వినియోగదారుల మ్యాక్ డివైజ్‌లోనే (Local AI) ప్రాసెస్ చేస్తుంది. అదే సమయంలో సంక్లిష్టమైన వెబ్ సెర్చ్‌లు, అడ్వాన్స్‌డ్ రీజనింగ్ , ప్లానింగ్ వంటి పెద్ద పనులను మాత్రమే క్లౌడ్ మోడల్స్‌కు పంపుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పెర్‌ప్లెక్సిటీ కంప్యూటర్ ఈ రెండింటినీ సమన్వయం చేయడం వల్ల వినియోగదారులు మాన్యువల్‌గా వేర్వేరు టూల్స్ మధ్య మారాల్సిన అవసరం లేకుండా పనులు సులభంగా పూర్తవుతాయి.
అత్యుత్తమ భద్రతనిచ్చే ప్రైవసీ గేట్
ఈ సాంకేతికతలో అత్యంత కీలకమైనది మ్యాక్‌లో పనిచేసే 'ప్రైవసీ గేట్' వ్యవస్థ. ఇందులో ఉండే ప్రత్యేక ఆన్-డివైజ్ పెర్‌ప్లెక్సిటీ క్లాసిఫైయర్, ఏదైనా సమాచారం కంప్యూటర్ దాటి క్లౌడ్‌కి వెళ్లే ముందే దాన్ని ఆటోమేటిక్‌గా తనిఖీ చేస్తుంది. వినియోగదారుల లాగిన్ పాస్‌వర్డ్‌లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు , ప్రభుత్వ గుర్తింపు కార్డులు వంటి అత్యంత రహస్యమైన వివరాలను ఇది వెంటనే గుర్తిస్తుంది. ఆ డేటాను క్లౌడ్‌కి వెళ్లకుండా లోకల్‌గానే ఉంచడం, క్లౌడ్ ప్రాసెసింగ్‌ను తిరస్కరించడం లేదా సదరు ఫైల్ బయటకు వెళ్లేముందు వినియోగదారుని ముందస్తు అనుమతి అడగడం ద్వారా సమాచారానికి గరిష్ట స్థాయి రక్షణను కల్పిస్తుంది.
సిస్టమ్ అవసరాలు , వినియోగించే విధానం
ఈ కొత్త సదుపాయం పెర్‌ప్లెక్సిటీ ప్రొ, మ్యాక్స్ , ఎంటర్‌ప్రైజ్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. దీనిని వినియోగించుకోవడానికి macOS 15 లేదా ఆపై వర్షన్‌తో పాటు కనీసం 24GB యూనిఫైడ్ మెమరీ (RAM) కలిగిన యాపిల్ సిలికాన్ మ్యాక్ సిస్టమ్‌లు అవసరం. ఇటీవల ఆపిల్ మార్కెట్లోకి తీసుకొచ్చిన మ్యాక్ మిని (Mac mini), మ్యాక్ స్టూడియో (Mac Studio) కంప్యూటర్లు ఈ హైబ్రిడ్ కంప్యూట్ నిర్వహణకు అత్యంత అనుకూలమని కంపెనీ తెలిపింది. ఇది ప్రస్తుతం Gemma 4 E4B, Qwen3.6 35B-A3B , పెర్‌ప్లెక్సిటీ సొంత మోడళ్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు ముందుగా మ్యాక్‌లో లేటెస్ట్ పెర్‌ప్లెక్సిటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో అందుబాటులో ఉన్న లోకల్ ఏఐ మోడల్‌ను ఒకే క్లిక్‌తో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మోడల్ సెలెక్టర్ విభాగానికి వెళ్లి 'హైబ్రిడ్' ఆప్షన్‌ను ఎంచుకుని, తమ పనికి తగిన లోకల్ , క్లౌడ్ మోడళ్లను సెలెక్ట్ చేసుకుని సురక్షితంగా పనులు పూర్తి చేసుకోవచ్చు.




