Poco X8 Power : 10,000mAh బ్యాటరీతో పోకో X8..!

Poco X8 Power : పోకో ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన నెక్స్ట్ జనరేషన్ 'పోకో X8' సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

G Krishna
Published on: 30 Aug 2026 1:55 PM IST
Poco X8 Power
X

Poco X8 Power

Poco X8 Power : పోకో ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన నెక్స్ట్ జనరేషన్ 'పోకో X8' సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే వారంలోనే ఈ కొత్త సిరీస్ ఇండియన్ మార్కెట్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ లైనప్‌లో భాగంగా ‘పోకో X8’ (Poco X8) , అత్యంత శక్తివంతమైన ‘పోకో X8 పవర్’ (Poco X8 Power) అనే రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుంది. డిస్‌ప్లే క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ , బిల్డ్ క్వాలిటీలో గత మోడళ్ల కంటే గణనీయమైన అప్‌గ్రేడ్స్‌తో ఇవి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్లు మార్కెట్లోకి రాకముందే వాటికి సంబంధించిన లీక్డ్ స్పెసిఫికేషన్లు, లాంచ్ డేట్ , ప్రైస్ డీటైల్స్ బయటకు వచ్చాయి.

లాంచ్ డేట్, సేల్ , అంచనా ధర వివరాలు

తాజా నివేదికల ప్రకారం, పోకో X8 సిరీస్ సెప్టెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటలకు భారతదేశంలో అధికారికంగా లాంచ్ కానుంది. మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ధరల విషయానికి వస్తే, బేస్ మోడల్ అయిన పోకో X8 ధర రూ. 28,000 నుంచి రూ. 30,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక హై-ఎండ్ మోడల్ అయిన పోకో X8 పవర్ ధర సుమారు రూ. 35,000 వరకు ఉండవచ్చని సమాచారం.

పోకో X8 లీక్డ్ స్పెసిఫికేషన్లు

లీక్ అయిన డీటైల్స్ ప్రకారం, పోకో X8 ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.83-అంగుళాల 1.5K LTPS OLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది గేమింగ్ , వీడియో వాచింగ్ సమయంలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని, దీనికి ఎల్ పీ డీ డీ ఆర్ 4ఎక్స్ ర్యామ్ , యుఎఫ్ ఎస్ 3.1 స్టోరేజ్ జతచేశారని తెలుస్తోంది. కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ మోడల్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 9,000mAh బ్యాటరీని అందించడం విశేషం.

పోకో X8 పవర్.. పవర్ ఫుల్ హార్డ్‌వేర్ , భారీ బ్యాటరీ!

స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే పోకో X8 పవర్ వేరియంట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రానుండగా, వేగవంతమైన పెర్ఫార్మెన్స్ కోసం ఎల్ పీ డీ డీ ఆర్ 5ఎక్స్ ర్యామ్, యుఎఫ్ ఎస్ 4.1 స్టోరేజ్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్ దీని బ్యాటరీనే అని చెప్పాలి. ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఏకంగా 10,000mAh రాక్షస బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చినట్లు సమాచారం. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా , ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story