Public WiFi: పబ్లిక్ వైఫైతో యూపీఐ పేమెంట్స్ చేయడం.. సురక్షితమా, కాదా.?
Public WiFi: ప్రస్తుతం రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, హోటళ్లు, కేఫ్‌లు, మాల్స్ వంటి చాలా చోట్ల ఉచిత పబ్లిక్ వైఫై అందుబాటులో ఉంటుంది.
Public WiFi: పబ్లిక్ వైఫైతో యూపీఐ పేమెంట్స్ చేయడం.. సురక్షితమా, కాదా.?
Public WiFi: ప్రస్తుతం రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, హోటళ్లు, కేఫ్‌లు, మాల్స్ వంటి చాలా చోట్ల ఉచిత పబ్లిక్ వైఫై అందుబాటులో ఉంటుంది. అయితే పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయినప్పుడు ఆర్థిక లావాదేవీలు చేయడం ఎంతవరకు సురక్షితం అనే సందేహం చాలామందికి ఉంటుంది.
పబ్లిక్ వైఫైలో అసలు ప్రమాదం ఏంటి?
పబ్లిక్ వైఫైని ఒకేసారి ఎంతో మంది ఉపయోగిస్తుంటారు. ఆ నెట్‌వర్క్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు, దాని భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే విషయం మనకు సాధారణంగా తెలియదు. ఇలాంటి పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అసలైన వైఫై పేరును పోలిన నకిలీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తారు. తెలియక ఎవరైనా అలాంటి నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే వారిని నకిలీ వెబ్‌సైట్లు లేదా మోసపూరిత పేజీలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం, తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
పబ్లిక్ వైఫైతో UPI పేమెంట్ సేఫ్‌నా?
UPI వ్యవస్థలోనే అనేక భద్రతా చర్యలు ఉంటాయి. అయితే పేమెంట్ చేస్తున్న సమయంలో మనం ఉపయోగించే ఇంటర్నెట్ నెట్‌వర్క్ కూడా ముఖ్యమే. ముఖ్యంగా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయి ఉన్నప్పుడు డబ్బులు పంపడం, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సెట్టింగ్‌లు మార్చడం, పాస్‌వర్డ్‌లను మార్చడం వంటి పనులు చేయకుండా ఉండటం మంచిది. పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయినంత మాత్రాన వెంటనే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు పోతాయని అర్థం కాదు. కానీ ఆ నెట్‌వర్క్‌పై పూర్తి నమ్మకం లేకపోతే ఆర్థిక లావాదేవీలు చేయడం అనవసరమైన రిస్క్ తీసుకున్నట్టే అవుతుంది.
బ్యాంకింగ్ చేయాలంటే మొబైల్ డేటానే మంచిది
బయట ఉన్నప్పుడు బ్యాంకింగ్ పని తప్పనిసరిగా చేయాల్సి వస్తే మీ ఫోన్‌లోని మొబైల్ డేటాను ఉపయోగించడం మెరుగైన మార్గం. మీ మొబైల్ డేటాను ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్‌కు హాట్‌స్పాట్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తెలియని పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా డబ్బులు పంపడం, బ్యాంక్ ఖాతాలో కీలకమైన మార్పులు చేయడం, పాస్‌వర్డ్ మార్చడం వంటి పనులను సొంత మొబైల్ నెట్‌వర్క్‌లో చేయడం మంచిది.
పబ్లిక్ వైఫై తప్ప మరో మార్గం లేకపోతే?
కొన్ని సందర్భాల్లో ఫోన్‌లో మొబైల్ డేటా అయిపోవచ్చు లేదా సిగ్నల్ అందుబాటులో లేకపోవచ్చు. అప్పుడు పబ్లిక్ వైఫై మాత్రమే ఇంటర్నెట్‌కు మార్గంగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు బ్యాంకింగ్, UPI ద్వారా డబ్బులు పంపడం వంటి పనులను వాయిదా వేయడం మంచిది. అత్యవసరంగా వైఫై ఉపయోగించాల్సి వస్తే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదు. తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదు. బ్యాంకింగ్ వివరాలు, OTP, UPI PIN వంటి సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదు. అవసరమైన పని పూర్తయిన వెంటనే ఆ పబ్లిక్ వైఫై నుంచి డిస్‌కనెక్ట్ అవ్వడం మంచిది.




