Power Bank: రూ.1,999కే 20000mAh పవర్ బ్యాంక్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Power Bank: రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్‌ను రూ.1,999కే అందిస్తోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, పలు గాడ్జెట్లకు సపోర్ట్, భద్రతా ఫీచర్లతో ఇది వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Power Bank: రూ.1,999కే 20000mAh పవర్ బ్యాంక్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Power Bank: రియల్‌మీ టెక్‌లైఫ్ రియల్‌ఫిట్ 20000mAh పవర్ బ్యాంక్‌ను రూ.1,999 ధరకు అందిస్తోంది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం ఈ పవర్ బ్యాంక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రయాణాల్లో పలు గాడ్జెట్లను వెంట తీసుకెళ్లే వారికి ఇది ఉపయోగపడేలా రూపొందించారు.
ఈ మోడల్‌లో 20,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఒక్కసారి పవర్ బ్యాంక్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌ను 3 నుంచి 4 సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చని సమాచారం. దీంతో తరచూ ఛార్జింగ్ అవసరమయ్యే పరిస్థితుల్లో అదనపు బ్యాటరీ బ్యాకప్ అందుతుంది.
ఛార్జింగ్ వేగం విషయానికి వస్తే.. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌బ్యాండ్లు, టాబ్లెట్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. చిన్న గాడ్జెట్ల కోసం ప్రత్యేక లో-కరెంట్ మోడ్‌ను కూడా అందించారు.
డిజైన్ పరంగా అంబర్ ఎల్లో రంగులో ఈ పవర్ బ్యాంక్‌ను అందిస్తున్నారు. కాంపాక్ట్ డిజైన్ కారణంగా బ్యాగ్‌లో తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుందని సమాచారం.
భద్రత కోసం మల్టిపుల్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వ్యవస్థను కూడా ఇందులో ఇచ్చారు. ఓవర్‌ఛార్జింగ్, అధిక వేడి, షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల నుంచి పరికరాలను రక్షించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
రూ.1,999 ధరలో 20,000mAh సామర్థ్యం, 45W ఫాస్ట్ ఛార్జింగ్, పలు గాడ్జెట్లకు ఈ పవర్ బ్యాంక్ ఒక ఎంపికగా నిలుస్తుంది.




