Realme C100i : రూ.14,999కే 6,500mAh బ్యాటరీ.. రియల్మీ C100i దుమ్మురేపే ఎంట్రీ.!
Realme C100i : పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి తమ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘Realme C100i’ ని అధికారికంగా..
realme-c100i
Realme C100i : పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి తమ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘Realme C100i’ ని అధికారికంగా రిలీజ్ చేసింది. తమ పాపులర్ ‘సి’ (C) సిరీస్‌లో భాగం అందించిన ఈ ఫోన్, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే యూజర్ల కోసం సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్లో అందుబాటులోకి వచ్చింది. పవర్ఫుల్ బ్యాటరీ, మోడర్న్ డిస్ప్లే, వాటర్ రెసిస్టెన్స్ బాడీతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.
ప్రైసింగ్, అవైలబిలిటీ , కలర్ ఆప్షన్స్
ఇండియన్ మార్కెట్లో Realme C100i స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ , 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్‌ను రూ. 14,999గా ఫిక్స్ చేశారు. స్పెషల్ ఆఫర్ కింద అర్హులైన స్టూడెంట్స్ కోసం రూ. 250 కూపన్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ హ్యాండ్సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తో పాటు రియల్మీ ఇండియా అఫీషియల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా సేల్‌కి అందుబాటులో ఉంది. యూజర్లు తమకి నచ్చినట్లు ఎంచుకోవడానికి మిడ్నైట్ బ్లాక్, స్కైలైన్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
స్మూత్ 120Hz డిస్ప్లే , డ్యూరబిలిటీ
ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్మీ యూఐ (Realme UI) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులోని 6.75 ఇంచుల హెచ్డీ+ (720x1570 పిక్సెల్స్) ఎల్సీడీ టచ్‌స్క్రీన్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 100% sRGB కలర్స్ , 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేకి స్క్రాచెస్ పడకుండా పాండా MN228 గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు. అంతేకాకుండా, వాటర్ స్ప్లాషెస్ , డస్ట్ నుంచి ఫోన్‌ను కాపాడటానికి ఈ బడ్జెట్ ఫోన్‌కు IP64 రేటింగ్ , ఆర్మోర్‌షెల్ (ArmorShell) ప్రొటెక్షన్ బాడీని అందించడం ఒక స్పెషల్ హైలైట్.
ప్రాసెసర్ , స్టోరేజ్ పెర్ఫార్మెన్స్
Realme C100i స్మార్ట్‌ఫోన్‌లో అక్టా-కోర్ యూనిసోక్ T7250 (Unisoc T7250) ప్రొసెసర్‌ను అమర్చారు. ఇది 1.8GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. గ్రాఫిక్స్ హెవీ టాస్క్‌ల కోసం ARM Mali-G57 జీపీయూని ఇందులో చేర్చారు. మొబైల్లో 4GB LPDDR4x ర్యామ్ , 64GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఒకవేళ మరింత స్టోరేజ్ కావాలనుకునే యూజర్లు మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని పెంచుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫోన్ అన్‌లాక్ , ప్రైవసీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను నిక్షిప్తం చేశారు.
క్యాజువల్ కెమెరాలు, 6,500mAh జంబో బ్యాటరీ
కెమెరా విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ సింగిల్ ఆటోఫోకస్ కెమెరాను, సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను ఆఫర్ చేస్తున్నారు. ఈ కెమెరా సెటప్‌తో 1080p క్వాలిటీతో ఫుల్ హెచ్డీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ మొబైల్లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటంటే దీని 6,500mAh భారీ బ్యాటరీ. ఇది 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రోజువారీ యూసేజ్‌లో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఆశిస్తున్న వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. కనెక్టివిటీ కోసం 4G LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని బేసిక్ సపోర్ట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు దాదాపు 210 గ్రాములు ఉంటుంది.




