సింగిల్ ఛార్జ్‌తో 3 రోజులు నాన్ స్టాప్ వాడకం.. రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు తెలిస్తే షాకే..!
Realme P4s Launch Date: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రియల్‌మీ గుడ్ న్యూస్ చెప్పింది. భారత మార్కెట్లోకి పీ-సిరీస్ నుంచి మరో సరికొత్త 5జీ మొబైల్‌ను తీసుకురాబోతోంది.
సింగిల్ ఛార్జ్‌తో 3 రోజులు నాన్ స్టాప్ వాడకం.. రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు తెలిస్తే షాకే..!
Realme P4s Launch Date: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రియల్‌మీ గుడ్ న్యూస్ చెప్పింది. భారత మార్కెట్లోకి పీ-సిరీస్ నుంచి మరో సరికొత్త 5జీ మొబైల్‌ను తీసుకురాబోతోంది. 'రియల్‌మీ పీ4ఎస్ 5జీ' (Realme P4s 5G) పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్ గురించి టెక్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీని ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
రియల్‌మీ సంస్థ తన పీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి పీ4, పీ4 లైట్, పీ4 ఎక్స్, పీ4 ప్రో 5జీ మోడల్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా రియల్‌మీ పీ4ఎస్ 5జీ మోడల్‌ను లాంచ్ చేసేందుకు సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ అధికారికంగా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా, అలాగే రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. లాంచ్‌కు ముందే సంస్థ వెల్లడించిన స్పెసిఫికేషన్స్ టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా డిస్ప్లే, ప్రాసెసర్ పరంగా యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఆకుపచ్చ, గోధుమ (బీజ్-బ్రౌన్) రంగుల్లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
అద్భుతమైన డిస్ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్
కొత్త ఫోన్‌లో శాంసంగ్ M14 ప్యానెల్‌తో కూడిన డిస్ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1,272 × 2,772 పిక్సెల్స్ రిజల్యూషన్ దీని సొంతం. ఏకంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రావడం ఈ మొబైల్ ప్రత్యేకత. హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఉండటంతో నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ కంటెంట్‌ను హై-క్వాలిటీతో ఎంజాయ్ చేయవచ్చు. స్క్రీన్ జీవితకాలం కూడా 50 శాతం పెరిగినట్లు కంపెనీ చెబుతోంది. మరోవైపు, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జీ చిప్‌సెట్ ఇందులో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకంగా హైపర్‌విజన్+ ఏఐ చిప్ జతచేశారు.
భారీ బ్యాటరీ.. దృఢమైన డిజైన్
ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఏకంగా 8,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల త్వరగా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకధాటిగా మూడు రోజుల పాటు వాడుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరా సెటప్ ఇందులో ఉంది. నీళ్లు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లతో ఈ మొబైల్‌ను అత్యంత దృఢంగా తీర్చిదిద్దారు.
వేరియంట్లు ఇవే..
లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB + 128GB, 8GB + 256GB తో పాటు హై-ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ + 256GB ఆప్షన్లలో లభించనుంది. పవర్‌ఫుల్ బ్యాటరీ, అత్యాధునిక ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో భారీ డిమాండ్ సృష్టించే అవకాశం ఉంది. గేమింగ్, ఫోటోగ్రఫీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా ఏ విభాగంలో చూసినా రియల్‌మీ పీ4ఎస్ 5జీ మొబైల్ బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.




