5,500mAh బ్యాటరీ, 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చేసిన రెడ్‌మీ M100 ప్రో.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Redmi M100 Pro: షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త M-సిరీస్‌లో రెండో ఫోన్ అయిన రెడ్‌మీ M100 ప్రోను చైనాలో విడుదల చేసింది. 6.67 అంగుళాల 1.5K కర్వ్డ్ OLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్, 50MP OIS కెమెరా, 5,500mAh బ్యాటరీతో ఈ ఫోన్ వచ్చింది.
5,500mAh బ్యాటరీ, 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చేసిన రెడ్‌మీ M100 ప్రో.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Redmi M100 Pro: కొన్ని నెలల క్రితం రెడ్‌మీ M100ను చైనాలో పరిచయం చేసిన షావోమీ, ఇప్పుడు ఆ సిరీస్‌ను విస్తరిస్తూ M100 ప్రోను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలోని షావోమీ స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని స్పెసిఫికేషన్లు రెడ్‌మీ నోట్ 14 ప్రో 5Gకి చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇది రీబ్రాండెడ్ మోడల్ అయ్యే అవకాశం ఉందని టెక్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
డిస్‌ప్లే, డిజైన్..
6.67 అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే, రిజల్యూషన్ 2712 × 1220 పిక్సెల్స్.
120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్.
డాల్బీ విజన్, HDR10+, 1920Hz PWM డిమ్మింగ్ సపోర్ట్.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్.
IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్.
పెర్ఫార్మెన్స్..
ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా (4nm) చిప్‌సెట్ ఉంది. దీనికి 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ జతచేశారు. ఇది హైపర్ఓఎస్ 3పై పనిచేస్తుంది.
కెమెరా..
వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 50MP సోనీ LYT-600 సెన్సార్ (1/1.96 అంగుళాలు, f/1.5 అపర్చర్), ఇందులో OIS సపోర్ట్ ఉంది.
బ్యాటరీ..
5,500mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం వైఫై 6, 5G, బ్లూటూత్ 5.4, NFC, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు.
ధర, కలర్స్..
12GB + 256GB సింగిల్ వేరియంట్ ధర 2,499 యువాన్లు (సుమారు రూ.35 వేలు, 350 డాలర్లు). బ్లాక్, వైట్, పర్పుల్, సియాన్ రంగుల్లో లభిస్తుంది.
భారత్‌లో వస్తుందా?
M-సిరీస్ ఫోన్లు చైనాకే పరిమితం కావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. గ్లోబల్ లేదా భారత్ లాంచ్‌పై కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.




