Redmi Note 17 5G Review: 8,000mAh బ్యాటరీ.. 3 రోజులు నడిచే ఫోన్..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి ఇటీవలే భారత మార్కెట్లోకి 'Redmi Note 17 5G' మోడల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, పెద్ద AMOLED డిస్‌ప్లే..
Redmi Note 17 5G
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి ఇటీవలే భారత మార్కెట్లోకి 'Redmi Note 17 5G' మోడల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, పెద్ద AMOLED డిస్‌ప్లే , 5G కనెక్టివిటీతో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే రియల్ లైఫ్ యూసేజ్‌లో ఈ ఫోన్ అందించే పెర్ఫార్మెన్స్, ఇందులో ఉన్న ప్లస్ పాయింట్లు , మైన్స్ పాయింట్లు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. బ్యాటరీ, డిస్‌ప్లే విభాగాలు ఈ ఫోన్‌కు ప్రధాన బలాలుగా నిలిస్తే, కెమెరా , గేమింగ్ పెర్ఫార్మెన్స్ విషయంలో రెడ్‌మి ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉంటే బాగుండేది.
మినిమల్ డిజైన్ , లార్జ్ AMOLED డిస్‌ప్లే
ఈ రెడ్‌మి నోట్ 17 5G డిజైన్ చాలా మినిమల్ అండ్ క్లాసీగా అనిపిస్తుంది. ఫోన్‌లో ఏకంగా 8,000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, కంపెనీ దీని థిక్‌నెస్‌ను కేవలం 8.3mm కి , వెయిట్‌ను 230 గ్రాములకు పరిమితం చేయడం అభినందనీయం. అయితే ఫోన్ సైజ్ కాస్త పెద్దదిగా ఉండటం వల్ల చిన్న చేతులు ఉన్నవారికి సింగిల్ హ్యాండ్‌తో వాడటం కొంత కష్టంగా అనిపించవచ్చు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే, ఇందులో 6.9 అంగుళాల Full HD+ AMOLED ప్యానెల్‌ను అందించారు. దీని బ్రైట్‌నెస్, అవుట్‌డోర్ విజిబిలిటీ చాలా బాగున్నాయి. కాకపోతే యూట్యూబ్‌లో హెచ్‌డిఆర్ (HDR) సపోర్ట్ లేకపోవడం చిన్న లోపంగా అనిపిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ , గేమింగ్ పెర్ఫార్మెన్స్
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది , లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ బ్రౌజింగ్ వంటి డైలీ యూసేజ్ టాస్క్‌లలో ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. UI లో కూడా ఎలాంటి ల్యాగ్ కనిపించదు. అయితే హెవీ మల్టీటాస్కింగ్ , గేమింగ్ విషయానికి వస్తే దీని లిమిటేషన్స్ బయటపడతాయి. BGMI గేమ్‌ను స్మూత్ , ఎక్స్‌ట్రీమ్ సెట్టింగ్స్‌లో ఆడవచ్చు, కానీ లాంగ్ గేమింగ్ సెషన్లలో ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తాయి. దీని ఆంటూటూ (AnTuTu) స్కోర్ దాదాపు 6.5 లక్షల వరకు ఉంటుంది. UFS 2.2 కి బదులుగా ఫాస్ట్ స్టోరేజ్ ఇచ్చి ఉంటే ఫోన్ స్పీడ్ ఇంకా బెటర్‌గా ఉండేది.
8,000mAh బ్యాటరీ , ఛార్జింగ్ స్పీడ్
ఈ స్మార్ట్‌ఫోన్‌కు మెయిన్ హైలైట్ దీని 8,000 mAh జెయింట్ బ్యాటరీ. నార్మల్ యూజర్లు ఈ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే ఏకంగా రెండు నుంచి మూడు రోజుల పాటు నిర్భయంగా వాడుకోవచ్చు. హెవీగా వాడే వారికి కూడా రెండు రోజుల బ్యాకప్ ఈజీగా లభిస్తుంది. దీనితో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ , 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కంపెనీ అందించింది. అయితే ఇంత భారీ బ్యాటరీకి కనీసం 67W ఛార్జింగ్ స్పీడ్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే 45W ఛార్జర్‌తో ఈ పెద్ద బ్యాటరీ ఫుల్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది.
50MP కెమెరా , నాణ్యత
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రైమరీ కెమెరా , 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పగటి వెలుతురులో లేదా గుడ్ లైటింగ్ కండిషన్స్‌లో ఫోటోలు బాగానే వస్తాయి, కానీ లో-లైట్‌లో డీటైలింగ్, కలర్స్ కాస్త తగ్గుతాయి. ఇందులో అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్ , ప్రైమరీ కెమెరాకి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటు. రేర్ , ఫ్రంట్ రెండు కెమెరాల ద్వారా 1080p క్వాలిటీలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
ధర, ఆల్టర్నేటివ్స్ , వర్డిక్ట్
ధరల విషయానికి వస్తే, Redmi Note 17 5G 6GB+128GB వేరియంట్ ధర సుమారు ₹28,000 కాగా, 8GB+128GB వేరియంట్ ధర దాదాపు ₹31,000 గా ఉంది. వివిధ బ్యాంక్ ఆఫర్లతో ఈ ప్రైస్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. అయితే మార్కెట్లో Poco M8 Power 5G మోడల్ దాదాపు సేమ్ హార్డ్‌వేర్ , ఫీచర్లతో ₹3,000 తక్కువ ధరకే లభిస్తోంది. కాబట్టి ఈ రెడ్‌మి ఫోన్ కొనేముందు పోకో ఆప్షన్‌ను కూడా ఒకసారి చెక్ చేయడం మంచిది. ఓవరాల్‌గా మీకు సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్, బిగ్ స్క్రీన్ ముఖ్యమనుకుంటే Redmi Note 17 5G ఒక మంచి ఛాయిస్ అవుతుంది.




