10,000mAh బ్యాటరీతో రెడ్‌మీ రచ్చ.. Note 17 Pro Max అదుర్స్

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టెక్ దిగ్గజం రెడ్‌మీ తమ మోస్ట్ అవైటెడ్ ‘నోట్ 17’ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ‘రెడ్‌మీ నోట్..

G Krishna
Published on: 28 Aug 2026 9:43 AM IST
Redmi Note 17 pro max
X

Redmi Note 17 pro max

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టెక్ దిగ్గజం రెడ్‌మీ తమ మోస్ట్ అవైటెడ్ ‘నోట్ 17’ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ‘రెడ్‌మీ నోట్ 17 ప్రో 5G’ తో పాటు అల్టిమేట్ ఫీచర్లతో కూడిన ‘రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్ 5G’ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ ప్రో మాక్స్ వేరియంట్‌లో ఇచ్చిన 10,000mAh జంబో బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, , ఆర్మోర్డ్ లెవెల్ డ్యూరబిలిటీ చూసి టెక్ లవర్స్ మైండ్ బ్లాంక్ అవుతోంది.

1.5K సూపర్ ఆమోలెడ్ డిస్‌ప్లే , రగ్గడ్ ప్రొటెక్షన్

REDMI Note 17 Pro Max 5G లో 6.83 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అత్యంత స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. అంతేకాకుండా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+, , డాల్బీ విజన్ సపోర్ట్ వల్ల అవుట్‌డోర్ విజన్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అందించడమే కాకుండా, ఫోన్ కిందపడినా డ్యామేజ్ కాకుండా ‘రెడ్‌మీ టైటాన్ స్ట్రక్చర్’ అనే స్పెషల్ రీ-ఇన్‌ఫోర్స్డ్ ఫ్రేమ్‌ను అమర్చారు.

ఎక్స్‌ట్రీమ్ IP69K రేటింగ్ , అండర్‌వాటర్ మోడ్

ఈ ఫోన్ డ్యూరబిలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. దీనికి IP66, IP68, IP69 , పవర్ ఫుల్ IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఇచ్చారు. 2 మీటర్ల నీటి లోతులో ఏకంగా 72 గంటల పాటు ఉంచినా ఈ ఫోన్‌కు ఏమీ కాదని కంపెనీ ప్రకటించింది. చేతులు తడిగా ఉన్నా లేదా వర్షంలో తడిసినా ఈజీగా వాడేందుకు 'వెట్ టచ్ టెక్నాలజీ 2.0' తో పాటు నీటి అడుగున ఫోటోలు తీసుకునేందుకు 'అండర్ వాటర్ మోడ్' ఫీచర్‌ను కూడా చేర్చారు.

10,000mAh బ్యాటరీ అండ్ రాకెట్ స్పీడ్ ఛార్జింగ్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెయిన్ హైలైట్ దీని 10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజులు గడిచినా బ్యాటరీ లైఫ్ అయిపోదు. కొన్ని రీజియన్లలో మాత్రం ఇది 9,210mAh కెపాసిటీతో లభిస్తుంది. ఈ బిగ్ బ్యాటరీని చకచకా ఛార్జ్ చేయడానికి 100W హైపర్ ఛార్జ్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇతర గ్యాడ్జెట్స్‌ను ఛార్జ్ చేసుకునేలా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అండ్ ఏఐ పవర్

స్పీడ్ అండ్ పెర్ఫార్మెన్స్ కోసం 4nm టెక్నాలజీతో తయారైన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. 8GB, 12GB LPDDR5X ర్యామ్ ఆప్షన్లతో పాటు డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా మెమరీని 24GB వరకు పెంచుకోవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌కు ఏకంగా 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను ఆఫర్ చేస్తోంది. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్, , షియోమీ సొంత HyperAI టూల్స్ వల్ల ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్లు చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి. డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి అన్ని బేసిక్స్ ఇచ్చారు.

4K కెమెరా సెటప్ అండ్ వేరియంట్ ప్రైస్

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, వెనుక వైపు OIS సపోర్ట్ , f/1.5 అపెర్చర్ కలిగిన 50MP మెయిన్ కెమెరా, , 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటితోనూ 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. AI Glare Removal, AI Erase Pro వంటి స్మార్ట్ ఎడిటింగ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ REDMI Note 17 Pro Max 5G క్లౌడ్ బ్లష్, గ్రీన్, పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని ప్రారంభ ధర USD 499 (మన భారత కరెన్సీలో దాదాపు రూ.47,670) గా నిర్ణయించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story