రూ.18,499కే శాంసంగ్‌ గెలాక్సీ ఏ08.. 6,000mAh బ్యాటరీ, 6 ఏళ్ల అప్‌డేట్స్‌.. ధరెంతంటే?

Samsung Galaxy A08: శాంసంగ్‌ భారత్‌లో Galaxy A08ను విడుదల చేసింది. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 90Hz డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌కు ఆరు తరాల OS అప్‌డేట్స్‌ లభిస్తాయి.

Venkat
Published on: 2 Oct 2026 9:50 PM IST
Samsung Galaxy A08
X

రూ.18,499కే శాంసంగ్‌ గెలాక్సీ ఏ08.. 6,000mAh బ్యాటరీ, 6 ఏళ్ల అప్‌డేట్స్‌.. ధరెంతంటే?

Samsung Galaxy A08: శాంసంగ్‌ (Samsung) భారత్‌లో Galaxy A08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అందుబాటు ధరలో వచ్చిన ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 90Hz రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.18,499గా నిర్ణయించారు.

Galaxy A08లో MediaTek Helio G99+ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4GB RAM, 64GB స్టోరేజ్‌తో లభించే ఈ వేరియంట్‌లో మైక్రోSD కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌ Android 16 ఆధారిత One UI 9తో వస్తుంది. ఆరు తరాల OS అప్‌గ్రేడ్స్‌, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని శాంసంగ్‌ తెలిపింది.

ఫోన్‌లో 6.7 అంగుళాల HD+ PLS LCD స్క్రీన్‌ 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో ఉంది. ముందు భాగంలో Corning Gorilla Glass 5 రక్షణ అందించారు. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్‌ ఉంది. ఫోన్‌ మందం 8 మిల్లీమీటర్లు.

కెమెరాల విషయానికి వస్తే వెనుక 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్‌ సెన్సర్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8MP ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ 6,000mAh సామర్థ్యంతో ఉండగా, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది.

Galaxy A08లో Circle to Search 3.0, Gemini, Perplexity వంటి ఫీచర్లు ఉన్నాయి. Samsung Knox ద్వారా డేటా రక్షణను అందించారు. Quick Share, Modes and Routines కూడా ఉన్నాయి.

ఈ ఫోన్‌ Dark Blue, Green, Silver రంగుల్లో లభిస్తుంది. Samsung స్టోర్లు, భాగస్వామ్య రిటైలర్లు, Samsung.comతో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.