Samsung Galaxy A57 5G: లీకైన శామ్‌సంగ్ గెలాక్సీ A57 5G వివరాలు.. 12GB ర్యామ్, సూపర్ కెమెరా సెటప్‌తో!

Samsung Galaxy A57 5G: శాంసంగ్ లవర్స్‌కి ఇది నిజంగా కిరాక్ న్యూస్ అని చెప్పాలి. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్న గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Sai Teja
Updated on: 18 March 2026 5:37 PM IST
Samsung Galaxy A57 5G
X

Samsung Galaxy A57 5G: లీకైన శామ్‌సంగ్ గెలాక్సీ A57 5G వివరాలు.. 12GB ర్యామ్, సూపర్ కెమెరా సెటప్‌తో!

Samsung Galaxy A57 5G: శాంసంగ్ లవర్స్‌కి ఇది నిజంగా కిరాక్ న్యూస్ అని చెప్పాలి. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్న గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కొరియన్ దిగ్గజం శాంసంగ్ అధికారికంగా ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయకపోయినా, ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలకు సంబంధించిన లీక్డ్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా థాయ్‌లాండ్‌కు సంబంధించిన ఒక మార్కెటింగ్ పోస్టర్ ద్వారా ఈ మొబైల్స్ ఎంత ఉండబోతున్నాయో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ గెలాక్సీ A సిరీస్ ఫోన్లు ప్రీమియం లుక్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లతో వస్తున్నట్లు సమాచారం.

ధర విషయానికొస్తే గెలాక్సీ A57 5G బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువే ఉండేలా కనిపిస్తోంది. థాయ్‌లాండ్‌లో దీని 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు THB 17,999 గా ఉండొచ్చని అంచనా, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 51,000 రూపాయల వరకు ఉండవచ్చు. అయితే శాంసంగ్ ఒక క్రేజీ ఆఫర్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 256GB వేరియంట్ కొనేవారికి అదే ధరలో 512GB వేరియంట్‌కు అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది. దీనివల్ల ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే యూజర్లకు ఇది ఒక మాంచి డీల్ అవుతుందని చెప్పవచ్చు.

ఇక గెలాక్సీ A37 5G విషయానికి వస్తే ఇది కాస్త అందుబాటు ధరలోనే కనిపిస్తోంది. దీని 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర థాయ్‌లాండ్‌లో THB 13,999 గా ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయి, అంటే మన దగ్గర సుమారు 40,000 రూపాయల వరకు ఉండొచ్చు. ధరతో పాటు బ్యాంక్ డిస్కౌంట్లు, ఈజీ EMI ఆప్షన్లు కూడా ఉంటాయని సమాచారం. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ఈ మోడల్ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. స్టైలిష్ డిజైన్, గెలాక్సీ బ్రాండింగ్ వాల్యూ ఈ ఫోన్‌ను యువతకు మరింత దగ్గర చేయనుంది.

కెమెరా పిచ్చోళ్ల కోసం శాంసంగ్ గెలాక్సీ A57 5Gలో అదిరిపోయే కెమెరా సెటప్‌ను ఇస్తోంది. దీని వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f/1.8 అపర్చర్‌తో వస్తోంది, ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలు తీయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌తో 4K క్వాలిటీ వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీల కోసం డిస్‌ప్లే పైభాగంలో హోల్-పంచ్ కటౌట్ ఉండబోతోంది, ఇది ఫోన్ లుక్‌ను మరింత ట్రెండీగా మార్చేస్తుంది.

ఫోన్ డిజైన్, వెయిట్ విషయానికొస్తే శాంసంగ్ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. గెలాక్సీ A57 5G కేవలం 6.9mm మందం మాత్రమే ఉండబోతోంది, ఇది చాలా స్లిమ్‌గా, ప్రీమియంగా ఉంటుంది. అలాగే దీని బరువు సుమారు 179 గ్రాములు మాత్రమే ఉండటంతో చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్‌వెయిట్‌గా అనిపిస్తుంది. ఇంత తక్కువ మందంతో శక్తివంతమైన ఫీచర్లను అందించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. కలర్ ఆప్షన్ల విషయంలో కూడా శాంసంగ్ యువతను ఆకర్షించే విధంగా డిఫరెంట్ షేడ్స్‌ను తీసుకురాబోతున్నట్లు హింట్స్ అందుతున్నాయి.

Sai Teja

Sai Teja

Next Story