RAM కాదు.. Samsung Galaxy Book6లో అసలు గేమ్‌చేంజర్ ఇదే.!
సాధారణంగా కొత్త లాప్‌టాప్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది కళ్ళు మొదట వెతికేది ర్యామ్ (RAM) ఎంత ఉందనేదే. ర్యామ్ ఎక్కువ ఉంటే లాప్‌టాప్ రాకెట్‌లా
samsung galaxy book6
సాధారణంగా కొత్త లాప్‌టాప్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది కళ్ళు మొదట వెతికేది ర్యామ్ (RAM) ఎంత ఉందనేదే. ర్యామ్ ఎక్కువ ఉంటే లాప్‌టాప్ రాకెట్‌లా పనిచేస్తుందని నమ్ముతారు. అయితే కేవలం ర్యామ్ సామర్థ్యం మాత్రమే ఒక లాప్‌టాప్ నిజమైన పనితీరును నిర్ధారించలేదన్నది చేదు నిజం. నిజానికి ప్రాసెసర్ ఆర్కిటెక్చర్, స్టోరేజ్ స్పీడ్, థర్మల్ కూలింగ్ మేనేజ్‌మెంట్ , బ్యాటరీ ఆప్టిమైజేషన్ వంటి అంశాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన 'సాంసంగ్ గెలాక్సీ బుక్6 సిరీస్' (Samsung Galaxy Book6 Series) స్పెసిఫికేషన్ షీట్‌ను దాటి అసలు సిసలైన పెర్ఫార్మెన్స్ ఎలా అందిస్తుందో చూద్దాం.
16GB vs 32GB ర్యామ్.. మీకు ఏది సరిపోతుంది.?
మనం చేసే పనిని బట్టి ర్యామ్ అవసరం మారుతుంటుంది. సాధారణంగా ఆన్‌లైన్ క్లాసులు, అసైన్‌మెంట్‌లు, వర్డ్ డాక్యుమెంట్లు, ప్రెజెంటేషన్లతో పాటు ఒకేసారి డజన్ల కొద్దీ బ్రౌజర్ ట్యాబ్‌లు వాడే విద్యార్థులకు గెలాక్సీ బుక్6 సిరీస్‌లోని 16GB ర్యామ్ మోడల్ ఎంతో సజావుగా సరిపోతుంది. కానీ భారీ ఎక్సెల్ షీట్‌లతో పనిచేసే చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్థులకు, కోడింగ్ ప్రాజెక్ట్‌లు చేసే ఇంజనీరింగ్ విద్యార్థులకు , రకరకాల బిజినెస్ టూల్స్ వాడే ఉద్యోగులకు 32GB ర్యామ్ మోడల్స్ అద్భుతమైన మల్టీటాస్కింగ్ అనుభూతిని ఇస్తాయి. మరోవైపు 4K వీడియో ఎడిటింగ్ చేసే క్రియేటర్లు, గేమింగ్ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసేవారికి గెలాక్సీ బుక్6 ప్రోలోని 32GB LPDDR5X మెమరీ సిస్టమ్ లాగ్ లేకుండా వేగవంతమైన రెంజరింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.
ప్రాసెసర్ మోడల్ సంఖ్య ముఖ్యం కాదు.. ఆర్కిటెక్చరే కింగ్
చాలామంది ప్రాసెసర్ నంబర్ పెద్దగా ఉంటే అది వేగంగా పనిచేస్తుందని భావిస్తారు, కానీ దాని వెనుక ఉన్న నిర్మాణ సాంకేతికత (Architecture) అసలు సిసలైన తేడాను చూపుతుంది. సాంసంగ్ గెలాక్సీ బుక్6 సిరీస్‌లో ఇంటెల్ అత్యంత అధునాతన 18A ప్రాసెస్ ఆధారంగా తయారు చేసిన Intel® Core Ultra Series 3 ప్రాసెసర్లను అందించారు. ఇవి మునుపటి తరం కంటే ఏకంగా 1.6 రెట్లు వేగవంతమైన సీపీయూ పనితీరును కనబరుస్తాయి. దీనికి తోడు ఇందులో ఉండే 50 TOPS సామర్థ్యం గల NPU (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్) ద్వారా AI టాస్క్‌లు నేరుగా ప్రాసెసర్‌పైనే రన్ అవ్వడం వల్ల నాయిస్ క్యాన్సిలేషన్, ఫోటో/వీడియో ఎడిటింగ్ , గెలాక్సీ AI ఫీచర్లు మెరుపు వేగంతో పనిచేస్తాయి. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ద్వారా గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ కూడా 1.7 రెట్లు పెరిగింది.
గెలాక్సీ ఈకోసిస్టమ్ , NVMe SSD స్పీడ్ ధమాకా
ఒక లాప్‌టాప్ పనితీరు కేవలం హార్డ్‌వేర్‌పైనే కాక, అది ఇతర పరికరాలతో అనుసంధానమయ్యే తీరుపై ఆధారపడి ఉంటుంది. గెలాక్సీ బుక్6 సిరీస్ మీ వద్ద ఉన్న గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్‌తో మల్టీ కంట్రోల్, క్విక్ షేర్ , నోట్స్ సింక్రనైజేషన్ ద్వారా క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే సైజ్ కంటే వేగమే ముఖ్యం. ఇందులోని 1TB NVMe SSD సహాయంతో లాప్‌టాప్ క్షణాల్లో బూట్ అవ్వడమే కాక, పెద్ద పెద్ద 4K వీడియోలు, CAD ఫైళ్లు కూడా ఆలస్యం లేకుండా ఓపెన్ అవుతాయి. అవసరమైన వారి కోసం ఈ సిరీస్‌లో 2TB వరకు పెంచుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది.
వేడెక్కకుండా కూల్ గా ఉండే థర్మల్ మేనేజ్‌మెంట్
ఎంత శక్తివంతమైన ప్రాసెసర్ ఉన్నప్పటికీ లాప్‌టాప్ వేడెక్కితే దాని పనితీరు దానంతట అదే తగ్గిపోతుంది, దీనినే 'థర్మల్ థ్రోట్లింగ్' అంటారు. ఈ సమస్యను అరికట్టేందుకు సాంసంగ్ గెలాక్సీ బుక్6 అల్ట్రా మోడల్‌లో వెడల్పాటి వేపర్ ఛాంబర్ , డ్యూయల్ పాత్ ఫ్యాన్లతో కూడిన రీ-డిజైన్డ్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చింది. దీనివల్ల థర్మల్ సామర్థ్యం 7 శాతం పెరిగింది. అలాగే బుక్6 ప్రోలో ఫ్యాన్ స్పేస్ 35 శాతం పెరగడం వల్ల గంటల తరబడి కోడింగ్ లేదా ఎడిటింగ్ చేసినా వేడెక్కకుండా స్థిరమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. డేటా రక్షణ కోసం హార్డ్‌వేర్ స్థాయిలోనే 'సాంసంగ్ నాక్స్' భద్రతా వ్యవస్థ రక్షణగా ఉంటుంది.
30 గంటల మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్
పెద్ద బ్యాటరీ ఉన్నంత మాత్రాన ఎక్కువ సమయం ఛార్జింగ్ వస్తుందనుకోవడం పొరపాటే. ప్రాసెసర్ , డిస్‌ప్లే ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉన్నప్పుడే రోజంతా బ్యాటరీ వస్తుంది. గెలాక్సీ బుక్6 ప్రో ఏకంగా 30 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇందులోని డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే అవసరాన్ని బట్టి తన రిఫ్రెష్ రేట్‌ను 30Hz వరకు తగ్గించుకుంటూ ఛార్జింగ్‌ను ఆదా చేస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా బుక్6 అల్ట్రాలోని సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 63 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తంమీద సాంసంగ్ గెలాక్సీ బుక్6 సిరీస్ కేవలం కాగితాలపై ఉండే స్పెసిఫికేషన్లకే పరిమితం కాకుండా నిజమైన పెర్ఫార్మెన్స్‌ను పరిచయం చేస్తోంది.




