Samsung F17e 5G: శామ్‌సంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. 50MP కెమెరా ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.!
Samsung F17e 5G : మీరు తక్కువ బడ్జెట్‌లో, అంటే రూ. 15,000 లోపు ఒక మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం శామ్‌సంగ్ నుండి ఒక అద్భుతమైన డీల్
Samsung F17e 5G : మీరు తక్కువ బడ్జెట్‌లో, అంటే రూ. 15,000 లోపు ఒక మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం శామ్‌సంగ్ నుండి ఒక అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ F17e 5G మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. స్మూత్ పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ బ్యాటరీ , నాణ్యమైన కెమెరా ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ప్రస్తుత మార్కెట్‌లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ధర , ఆఫర్ల వివరాలు
బ్యాంక్ డిస్కౌంట్: ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ F17e 5G అసలు ధర రూ. 16,999 ఉండగా, ప్రస్తుతం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో భాగంగా దీనిని కేవలం రూ. 14,499 కే సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా మరికొన్ని బ్యాంక్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 725 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీనితో ఫోన్ తుది ధర రూ. 13,774 కు తగ్గుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే, ఎక్స్ఛేంజ్ ద్వారా గరిష్టంగా రూ. 10,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
EMI సౌకర్యం: ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారి కోసం నెలకు కేవలం రూ. 510 నుండి ప్రారంభమయ్యే సులభ వాయిదా పద్ధతులు (EMI) కూడా అందుబాటులో ఉన్నాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ F17e 5G స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పరంగానే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో 6.74-అంగుళాల భారీ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడం వల్ల వీడియోలు చూడటం లేదా గేమ్స్ ఆడటం చాలా స్మూత్‌గా ఉంటుంది.
ప్రాసెసర్: ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 5G కనెక్టివిటీతో పాటు మల్టీటాస్కింగ్‌కు మంచి వేగాన్ని ఇస్తుంది.
స్టోరేజ్: ఇందులో 4GB RAM , 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
కెమెరా సెటప్: ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
బ్యాటరీ బ్యాకప్: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 6000mAh బ్యాటరీ. ఒకసారి చార్జ్ చేస్తే ఏకంగా 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
బ్రాండెడ్ వాల్యూ, భారీ బ్యాటరీ బ్యాకప్ , 5G నెట్‌వర్క్ సపోర్ట్ కోరుకునే వారికి ఈ ధరలో శామ్‌సంగ్ గెలాక్సీ F17e 5G ఒక సరైన ఎంపిక. ఆఫర్ ముగియకముందే ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని చెక్ చేయడం మంచిది.




