గీక్‌బెంచ్‌లో Galaxy F70 Pro రచ్చ.. 6 ఏళ్ల అప్‌డేట్స్‌తో గేమ్ ఛేంజర్.!
Samsung Galaxy F70 Pro : దక్షిణ కొరియా టెక్ జెయింట్ శామ్‌సంగ్ తన పాపులర్ ఎఫ్-సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి గ్రాండ్ ప్రిపరేషన్స్
Samsung-Galaxy-F70-Pro
Samsung Galaxy F70 Pro : దక్షిణ కొరియా టెక్ జెయింట్ శామ్‌సంగ్ తన పాపులర్ ఎఫ్-సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి గ్రాండ్ ప్రిపరేషన్స్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న 'శామ్‌సంగ్ గెలాక్సీ F70 ప్రొ' తాజాగా ప్రాచుర్యం పొందిన గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. మోడల్ నంబర్ SM-E476B తో లిస్ట్ అయిన ఈ ఫోన్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్ , పెర్ఫార్మెన్స్ స్కోర్‌లకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ డీటైల్స్ బయటకు వచ్చాయి.
గీక్‌బెంచ్ టెస్టింగ్ స్కోర్ అండ్ పవర్‌ఫుల్ ప్రాసెసర్
గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం ఈ గెలాక్సీ F70 ప్రొ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రాబోతోంది. రీసెంట్‌గా లాంచ్ అయిన గెలాక్సీ M47 ఫోన్‌లో కూడా ఇదే స్పీడ్ ప్రాసెసర్‌ను అందించిన విషయం తెలిసిందే. ఈ డివైజ్ గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 998 పాయింట్లు , మల్టీ-కోర్ టెస్ట్‌లో 3,090 పాయింట్లు సాధించి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ నమోదు చేసింది. అంతేకాకుండా 8GB ర్యామ్ , లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ సాఫీగా రన్ కానున్నట్లు స్పష్టమవుతోంది.
డిస్‌ప్లే, కెమెరా అండ్ హెవీ బ్యాటరీ బ్యాకప్
లీకైన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లు ఎంతో అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. కెమెరా విభాగానికి వస్తే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ రానుంది. ఫోన్ పవర్ బ్యాకప్ కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బిగ్ 6,000mAh హెవీ బ్యాటరీని సెట్ చేశారు. వీటితో పాటు ప్రీమియమ్ లెదర్-లైక్ ఫినిషింగ్ రియర్ ప్యానెల్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్, LPDDR5X ర్యామ్ , UFS 3.1 స్టోరేజ్ టైప్స్‌ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 తో రానున్న ఈ ఫోన్‌కు ఏకంగా 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తుండటం బిగ్గెస్ట్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.
ఇండియా లాంచ్ టైమ్‌లైన్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్
ఇప్పటికే ఈ ఫోన్ భారతీయ సర్టిఫికేషన్ పోర్టల్ BIS, బ్లూటూత్ SIG డేటాబేస్‌తో పాటు శామ్‌సంగ్ ఇండియా అఫీషియల్ సైట్‌లో కూడా కనిపిస్తుండటంతో ఇండియా లాంచ్ చాలా త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ గెలాక్సీ F70 ప్రొ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభించనుంది. ఇందులో 6GB + 128GB వేరియంట్ ధర సుమారు రూ. 32,999 ఉండగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 36,999 గా , టాప్ ఎండ్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 41,999 గా ఉండే అవకాశం ఉంది. రీసెంట్‌గా వచ్చిన గెలాక్సీ M47 మోడల్‌కి ఇది ఎఫ్-సిరీస్ కౌంటర్ పార్ట్‌గా, స్పెషల్ ఆన్‌లైన్ సేల్స్ ఛానెల్స్ ద్వారా మార్కెట్‌లో హల్‌చల్ చేయనుంది.




