శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 4 డిజైన్ లీక్.. 3 రంగుల్లో రానున్న కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్..?
Samsung Galaxy Fit 4: శాంసంగ్ కొత్త తరం ఫిట్‌నెస్ బ్యాండ్‌పై ఆసక్తి పెరుగుతోంది. గెలాక్సీ ఫిట్ 3 విడుదలై రెండేళ్లకు పైగా సమయం కావడంతో, తదుపరి తరం ప్రోడక్ట్ కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 4 డిజైన్ లీక్.. 3 రంగుల్లో రానున్న కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్..?
Samsung Galaxy Fit 4: శాంసంగ్ కొత్త తరం ఫిట్‌నెస్ బ్యాండ్‌పై ఆసక్తి పెరుగుతోంది. గెలాక్సీ ఫిట్ 3 విడుదలై రెండేళ్లకు పైగా సమయం కావడంతో, తదుపరి తరం ప్రోడక్ట్ కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఫిట్ 4కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా లీకైన ఫోటోల్లో ఈ పరికరం డిజైన్, రంగుల వివరాలు కనిపించాయి. దీంతో త్వరలోనే కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు బలపడుతున్నాయి.
మూడు రంగుల్లో గెలాక్సీ ఫిట్ 4?
బయటకు వచ్చిన చిత్రాల ప్రకారం గెలాక్సీ ఫిట్ 4 నలుపు, తెలుపు, లేత నీలం రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఇది గతంలో వచ్చిన గెలాక్సీ ఫిట్ 3ను పోలి ఉండే అవకాశం కనిపిస్తోంది.
కొత్త డివైజ్ నిలువుగా పొడవుగా ఉండే దీర్ఘచతురస్రాకార స్క్రీన్ ను అందించనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ చుట్టూ అంచులు కూడా సన్నగా ఉండే అవకాశం ఉంది. డివైజ్ కుడివైపు ఒక బటన్‌ను ఏర్పాటు చేసినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది. దాని పక్కనే చిన్న రంధ్రం కూడా కనిపిస్తోంది.
గెలాక్సీ ఫిట్ 4తో మార్చుకునే సిలికాన్ బెల్గ్‌ను అందించే అవకాశం ఉంది. బయటకు వచ్చిన ఫొటోల్లో కొత్త స్క్రీన్ డిజైన్ కూడా కనిపిస్తోంది. ఇందులో టైం, గుండె స్పందన, తేదీ వంటి వివరాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శాంసంగ్ అధికారికంగా ఈ వివరాలను ధృవీకరించలేదు.
గెలాక్సీ ఫిట్ 3 ధర ఎంత?
శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3ను భారత మార్కెట్లో 2024 ఫిబ్రవరిలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4,999గా ఉంది. ఈ పరికరం బూడిద, వెండి, గులాబీ బంగారు రంగుల్లో లభించింది.
గెలాక్సీ ఫిట్ 3లో 1.6 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఇందులో 16 మెగాబైట్ల ర్యామ్, 256 మెగాబైట్ల స్టోరేజ్ ఉన్నాయి. వినియోగదారుల కోసం 100కు పైగా స్క్రీన్‌ను అందించారు. ఇప్పుడు గెలాక్సీ ఫిట్ 4లో డిజైన్‌తో పాటు ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన సౌకర్యాలను శాంసంగ్ మరింత మెరుగుపరుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొత్త డివైజ్ ధర, విడుదల తేదీ, పూర్తి టెక్నాలజీ వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




