శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మునుపెన్నడూ లేని ఫీచర్లతో కొత్త ఫోన్.. యాపిల్‌కు గట్టిపోటీ పక్కా..!
Samsung Galaxy S26 FE: ప్రీమియం ఫీచర్లను బడ్జెట్ ధరలో అందించే ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ల కోసం యూజర్లు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మునుపెన్నడూ లేని ఫీచర్లతో కొత్త ఫోన్.. యాపిల్‌కు గట్టిపోటీ పక్కా..!
Samsung Galaxy S26 FE: స్మార్ట్‌ఫోన్ ప్రియులను అలరించేందుకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో సరికొత్త మోడల్‌ను పరిచయం చేయబోతోంది. 'గెలాక్సీ ఎస్26' కుటుంబంలో భాగంగా అత్యంత అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఫ్యాన్ ఎడిషన్‌గా పిలుస్తున్న ఈ కొత్త డివైజ్ లాంచ్ ఈవెంట్‌ను ఆగస్టు 27న వర్చువల్‌గా నిర్వహించేందుకు మొబైల్ కంపెనీ సన్నాహాలు పూర్తి చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్26 సిరీస్‌ను, జులైలో జెడ్ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి భారీ లాంచ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 27వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్‌లో ఈ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
కొత్తగా రాబోతున్న మోడల్ పేరును కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది 'గెలాక్సీ ఎస్26 ఎఫ్‌ఈ' (ఫ్యాన్ ఎడిషన్) అని టెక్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గెలాక్సీ ఎస్26లో ఉన్న అత్యుత్తమ కెమెరా, అధునాతన ఏఐ అనుభవాలను మరింత మంది యూజర్లకు చేరువ చేసే ఉద్దేశంతోనే ఈ మోడల్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు హింట్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని ప్రాథమిక సమాచారం.పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే..
లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను అందించనున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రానున్న ఈ ఫోన్ స్క్రీన్.. ఎండలోనూ స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. పనితీరు పరంగా ఇందులో ఎక్సినోస్ 2500 చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో ఇది అందుబాటులోకి రానుంది. ఎస్25 ఎడ్జ్ మోడల్ తరహాలో కెమెరా మాడ్యూల్‌ను కాస్త ఎత్తుగా డిజైన్ చేశారు. గ్రే, మింట్ రంగుల్లో ఈ ఫోన్ ఆకర్షణీయంగా కనిపించనుంది.
ఆకట్టుకునే కెమెరా సెటప్..
ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు మూడు కెమెరాల సెటప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ షూటర్‌ను అమర్చారు. వీటికి తోడు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4900 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ డివైజ్‌లో అందించనున్నారు.




