గెలాక్సీ లవర్స్‌కు పండగే.. శాంసంగ్ బాహుబలి ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ.25,000 తగ్గిన ధర..!
Samsung Galaxy S26 Ultra 5G: ప్రీమియం లుక్, హై-ఎండ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగానే సువర్ణావకాశం.
గెలాక్సీ లవర్స్‌కు పండగే.. శాంసంగ్ బాహుబలి ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ.25,000 తగ్గిన ధర..!
Samsung Galaxy S26 Ultra 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ క్రాేజీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆండ్రాయిడ్ ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G పై ఊహించని రేంజ్‌లో ధర తగ్గింది. భారీ తగ్గింపుతో పాటు లభిస్తున్న అదనపు ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
లాంచ్ అయిన కొద్ది నెలలకే దిగివచ్చిన ధర!
ప్రీమియం లుక్, హై-ఎండ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగానే సువర్ణావకాశం. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి అట్టహాసంగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 5G ధర ఇప్పుడు భారీగా దిగివచ్చింది. లాంచ్ సమయంలో ఆకాశాన్ని తాకిన ఈ మొబైల్ ధర.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఏకంగా 25 వేల రూపాయల తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్ అయిన 12GB రామ్, 256GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ.1,17,964ల ప్రత్యేక ధరతో లిస్ట్ అయింది.
బ్యాంక్ ఆఫర్లతో అదనపు ఊరట..
ఈ భారీ డిస్కౌంట్‌తోనే ఫ్లిప్‌కార్ట్ ఆగిపోలేదు. కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. మీరు గనుక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. తక్షణమే రూ.3,500 ల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ కలుపుకున్న తర్వాత ఈ ప్రీమియం ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.1,14,464 వద్దకు తగ్గుతుంది. ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండానే వినియోగదారులకు నేరుగా భారీగా డబ్బు ఆదా అవుతుండటం విశేషం.
రూ.60 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్!
మీరు ప్రస్తుతం వాడుతున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవాలనుకుంటే.. ఈ డీల్‌లో మరో బంపర్ ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇందులో ఏకంగా రూ.60,300ల వరకు గరిష్ట ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ విలువ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ యొక్క బ్రాండ్, మోడల్, అది ఎంతవరకు వర్కింగ్ కండిషన్‌లో ఉందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు మంచి వాల్యూ వస్తే మాత్రం.. ఈ బాహుబలి ఫోన్ చాలా తక్కువ ధరకే మీ సొంతమవుతుంది.
సినిమా హాల్ లాంటి అల్ట్రా డిస్‌ప్లే, నెక్ట్స్ లెవెల్ ప్రాసెసర్..
ఫీచర్ల పరంగా చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ ఒక అద్భుతమనే చెప్పాలి. ఇందులో కంటికి నచ్చేలా 6.9 ఇంచుల భారీ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను అందించారు. ఇది క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రెజోల్యూషన్‌ను, స్మూత్ గేమింగ్, స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా, క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను అమర్చారు. దీనివల్ల ఫోన్ ఎంత వాడినా అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
200 మెగాపిక్సెల్ కెమెరా.. ఫొటోగ్రఫీ ప్రియులకు స్వర్గధామం..
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని వెనుక భాగంలో ఉన్న క్వాడ్ కెమెరా సెటప్. ఇందులో f/1.4 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి వేళల్లో కూడా ఇది అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది. దీనితో పాటు 5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ గల 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
పవర్‌ఫుల్ బ్యాట్రీ, ప్రీమియం డిజైన్..
ఈ ఫోన్‌లో 5000mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాట్రీని అమర్చారు. ఇది 60W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేయడం వల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా సూపర్ ఫాస్ట్ 5G నెట్‌వర్క్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. కేవలం 7.9 మీమీ మందం, 214 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి ఈ ఫోన్ చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
మొత్తానికి శాంసంగ్ బ్రాండ్‌ను ఇష్టపడే వారికి, ఒకేసారి బెస్ట్ కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ కావాలనుకునే వారికి ఈ ఫ్లిప్‌కార్ట్ డీల్ ఒక అద్భుతమైన అవకాశం. రూ.25,000ల భారీ తగ్గింపుతో లభిస్తున్న ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే చెక్ చేయండి.




