Samsung Galaxy S27లో కెమెరా బ్లాస్ట్.. 50MP టెలిఫోటో లెన్స్‌తో మార్కెట్‌లోకి?
గ్లోబల్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తమ నెక్స్ట్ జెనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ 'శామ్‌సంగ్ గెలాక్సీ S27' సిరీస్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రాండ్‌గా..
samsung galaxy s27
గ్లోబల్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తమ నెక్స్ట్ జెనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైనప్ 'శామ్‌సంగ్ గెలాక్సీ S27' సిరీస్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రాండ్‌గా మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ లాంచ్‌కి ఇంకా దాదాపు ఆరు నెలల టైమ్ ఉన్నప్పటికీ, టెక్ ప్రియుల్లో దీనిపై అప్పుడే తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ డిజైన్, ఫీచర్లు , ముఖ్యంగా కెమెరా హార్డ్‌వేర్‌కు సంబంధించి కీలకమైన లీక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈసారి తన లైనప్‌లోని మోడళ్ల మధ్య ఒకే రకమైన 'షేర్డ్ టెలిఫోటో కెమెరా' స్ట్రాటజీని అమలు చేయడానికి శామ్‌సంగ్ ఇంటర్నల్‌గా టెస్టులు నిర్వహిస్తున్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
షేర్డ్ టెలిఫోటో హార్డ్‌వేర్ అండ్ యూనిఫార్మ్ కెమెరా సెటప్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రముఖ టిప్‌స్టర్ స్క్రోడింగర్ వివరాల ప్రకారం.. గెలాక్సీ S27 లైనప్‌లోని పలు మోడళ్లలో ఒకే రకమైన టెలిఫోటో హార్డ్‌వేర్‌ను అమర్చేందుకు శామ్‌సంగ్ ప్లాన్ చేస్తోంది. బేస్ మోడల్ అయిన గెలాక్సీ S27, గెలాక్సీ S27+ వేరియంట్లు రెండూ కూడా S27 ప్రో మోడల్‌తో కలిసి సేమ్ 3x టెలిఫోటో సిస్టమ్‌ను పంచుకోనున్నాయని సమాచారం. అంతేకాకుండా యూజర్లకు బెటర్ కెమెరా ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఈ బేస్ మోడళ్లలోని ప్రైమరీ మెయిన్ కెమెరా , అల్ట్రా-వైడ్ కెమెరా హార్డ్‌వేర్‌ను టాప్-ఎండ్ గెలాక్సీ S27 అల్ట్రాతో సమానంగా అప్‌గ్రేడ్ చేసే ఆలోచనలో కూడా కంపెనీ ఉందంట.
గెలాక్సీ S27 అల్ట్రాలో 50MP 4x టెలిఫోటో లెన్స్ – ప్రొడక్షన్ లెక్కలు ఇవే
ఇక ఈ సిరీస్‌లోనే అత్యంత ప్రీమియం , ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గెలాక్సీ S27 అల్ట్రా కోసం శామ్‌సంగ్ మరింత పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌ను పరిశీలిస్తోంది. 1/1.9-ఇంచ్ సెన్సార్ పరిమాణంతో కూడిన 50-మెగాపిక్సెల్ 4x టెలిఫోటో లెన్స్‌ను S27 అల్ట్రాలో అమర్చాలని కంపెనీ భావిస్తోంది. అయితే డివైజ్ ప్రొడక్షన్ ఖర్చులు (BOM costs) , రియల్ టైమ్ ప్రాక్టికల్ యూసేజ్‌ని బేస్ చేసుకుని దీనిపై ఫైనల్ డిసిషన్ తీసుకోనున్నారు. ఒకవేళ నేటివ్ 4x జూమ్ , సంప్రదాయ 5x టెలిఫోటో సిస్టమ్ మధ్య ఇమేజ్ క్వాలిటీలో పెద్దగా తేడా లేదనిపిస్తే, అనవసరపు ప్రొడక్షన్ కాస్ట్ పెంచకుండా పాత 5x టెలిఫోటో సిస్టమ్‌నే కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.
5 ప్రొటోటైప్స్ పరిశీలన.. సెప్టెంబర్ 9న ఫైనల్ డిసిషన్!
ప్రస్తుతం శామ్‌సంగ్ గెలాక్సీ S27 అల్ట్రా మోడల్‌కి సంబంధించి దాదాపు ఐదు రకాల ప్రొటోటైప్ వెర్షన్లను కంపెనీ ల్యాబ్స్‌లో టెస్ట్ చేస్తోందని, ప్రెజెంట్ ఇంకా ఏ ఒక్క కెమెరా కాన్ఫిగరేషన్‌ను కన్ఫర్మ్ చేయలేదని సమాచారం. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫైనల్ కెమెరా సెటప్‌పై సెప్టెంబర్ 9 నాటికి కంపెనీ ఒక క్లియర్ డిసిషన్‌కు వచ్చే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. గతంలో వచ్చిన గెలాక్సీ S26 అల్ట్రా మోడల్‌లో నాలుగు రియర్ కెమెరాలు ఉండగా, ఈసారి డిజైన్ మార్పుల్లో భాగంగా S27 అల్ట్రాలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కేవలం మూడు పవర్‌ఫుల్ కెమెరాలు మాత్రమే ఉండేలా రూపుదిద్దుతోందని పుకార్లు వస్తున్నాయి. అధికారిక లాంచ్ డేట్ దగ్గరపడే కొద్దీ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల డిస్‌ప్లే, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ ఫీచర్లపై మరిన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు రానున్నాయి.




