Samsung Galaxy Tab S12+ : శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్ లీక్..
Samsung Galaxy Tab S12+ : టెక్ దిగ్గజం శామ్సంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా
samsung-galaxy-tab-s12-plus
Samsung Galaxy Tab S12+ : టెక్ దిగ్గజం శామ్సంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 'శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+' ఫస్ట్ లుక్ ఆన్లైన్లో లీక్ అవ్వడంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త ట్యాబ్లెట్ ఫ్రంట్ డిజైన్‌తో పాటు కొన్ని క్రేజీ ఫీచర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ సిరీస్‌లో గెలాక్సీ ట్యాబ్ S12+ మోడల్‌తో పాటు మరింత అడ్వాన్స్డ్ వెర్షన్ అయిన 'గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా'ను కూడా కంపెనీ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.
మోడల్ నంబర్లు.. సేఫ్టీ సర్టిఫికేషన్స్
ఆన్లైన్ లీక్స్ ప్రకారం.. గెలాక్సీ ట్యాబ్ S12+ వై-ఫై (Wi-Fi) వేరియంట్ SM-X840 మోడల్ నంబర్‌తో రానుంది. అలాగే 5G వేరియంట్ SM-X846N మోడల్ నంబర్‌తో వస్తోంది. ఈ రెండు మోడళ్లు ఇప్పటికే దక్షిణ కొరియాలో సేఫ్టీ సర్టిఫికేషన్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
బిగ్ డిస్ప్లే.. బెజెల్‌లోనే కెమెరా
లీక్ అయిన ఫొ nటోలను గమనిస్తే.. గెలాక్సీ ట్యాబ్ S12+లో ఫ్రంట్ కెమెరాను డిస్ప్లే బెజెల్‌లోనే సెట్ చేశారు. అయితే ఈ కెమెరా రిజల్యూషన్ ఎంత అనే డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో ఏకంగా 14.6 అంగుళాల భారీ స్క్రీన్‌ను అందించబోతున్నారట. ఇంత పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల సినిమా లవర్స్‌కు, గేమర్స్‌కు, ఆఫీస్ పనులు చేసుకునే ప్రొఫెషనల్స్‌కు ఈ ట్యాబ్లెట్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
పవర్ఫుల్ ప్రాసెసర్.. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్
ఈ ట్యాబ్లెట్ పర్ఫార్మెన్స్ విషయంలో శామ్సంగ్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇందులో అత్యంత శక్తివంతమైన 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (MediaTek Dimensity 9500) ఆక్టా-కోర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను వాడబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ట్యాబ్లెట్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది.
ఛార్జింగ్ టెన్షన్ లేని భారీ బ్యాటరీ
పెద్ద డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్నప్పుడు బ్యాటరీ కూడా అంతే బలంగా ఉండాలి కదా.. అందుకే ఈ ట్యాబ్లెట్లో ఏకంగా 11,600mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇస్తున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. దీనివల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ సేపు వస్తుంది.
లాంచ్ ఎప్పుడు ఉండొచ్చు.?
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం.. శామ్సంగ్ ఈ గెలాక్సీ ట్యాబ్ S12+ను ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి అఫీషియల్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే అక్టోబర్ నెలలో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ S26 FE' మోడల్‌ను కూడా కంపెనీ పరిచయం చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వివరాలన్నింటిపై శామ్సంగ్ కంపెనీ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి కంపెనీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వీటిని కేవలం లీకులు లేదా పుకార్లుగానే భావించాల్సి ఉంటుంది.




