శాంసంగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఏఐ ఫీచర్లతో వచ్చేస్తోన్న వన్ యూఐ 8.5 వెర్షన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Samsung, One UI 8.5: శాంసంగ్ కొత్త వన్ యూఐ 8.5ను రీలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త అప్ డేట్లో ఫీచర్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్స్‌ను మరింత సమర్థవంతంగా పనిచేసేలా మార్చనుంది.
శాంసంగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఏఐ ఫీచర్లతో వచ్చేస్తోన్న వన్ యూఐ 8.5 వెర్షన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Samsung One UI 8.5 update: శాంసంగ్ తన గెలాక్సీ వినియోగదారుల కోసం సరికొత్త 'వన్ యూఐ 8.5' (One UI 8.5) అప్డేట్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, మెరుగైన కెమెరా పనితీరుతోపాటు సరికొత్త ఇంటర్ఫేస్తో కూడిన ఈ అప్డేట్, స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రూపొందించింది.
అప్డేట్ అందుకునే ఫోన్ల జాబితా ఇదే..
శాంసంగ్ తన తాజా ఫ్లాగ్షిప్ సిరీస్‌లతో పాటు పాత ప్రీమియం మోడళ్లకు కూడా ఈ అప్డేట్ను అందిస్తోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో ప్రారంభమైన ఈ రోల్ అవుట్, రాబోయే కొద్ది వారాల్లో భారత్ సహా ఇతర దేశాలకు విస్తరించనుంది. ఈ అప్డేట్ పొందనున్న ఫోన్లు ఏవో ఓసారి చూద్దాం..
గెలాక్సీ ఎస్25 సిరీస్ (S25 Series, S25 FE)
గెలాక్సీ ఎస్24 సిరీస్ (S24 Series)
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, ఫ్లిప్ 6
గెలాక్సీ టాబ్ ఎస్11, ఎస్10 సిరీస్
సుదీర్ఘ కాలం పాటు బీటా టెస్ట్‌లు నిర్వహించిన అనంతరం, శాంసంగ్ అత్యంత పటిష్టమైన వెర్షన్‌ను వినియోగదారుల ముందుకు తెచ్చింది.
గెలాక్సీ ఏఐ (Galaxy AI) తో స్మార్ట్ ఫీచర్లు..
వన్ యూఐ 8.5 ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సిస్టమ్ అంతటా విలీనం చేసింది. 'ఏజెంటిక్ ఏఐ' సాయంతో ఫోన్ వాడకం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా 'క్రియేటివ్ స్టూడియో' ద్వారా వినియోగదారులు సొంతంగా కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్‌లో 'ఫోటో అసిస్ట్' ఫీచర్ ద్వారా ఒక ఫోటోలోని వస్తువులను మరొక ఫోటోలోకి సులభంగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా, బిక్స్బీ (Bixby) ఇప్పుడు మరింత తెలివిగా కాల్ స్క్రీనింగ్, ఇతర పనులను ఈజీగా చేయగలదు.
కెమెరా, వీడియోలో విప్లవాత్మక మార్పులు..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం శాంసంగ్ అద్భుతమైన మార్పులు చేసింది. లోగ్ (Log) వీడియో షూటింగ్ సమయంలో రియల్ టైమ్ ప్రివ్యూలు చూడవచ్చు. ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసే 'డ్యూయల్ వీడియో' సదుపాయం మరింత మెరుగుపరిచింది. డాక్యుమెంట్లను స్కాన్ చేసేటప్పుడు వేళ్లు లేదా మడతలు పడకుండా ఏఐ ద్వారా ఆటోమేటిక్‌గా క్లీన్ చేసే సౌలభ్యం ఇందులో ఉంది.
భద్రత..
కొత్త ఇంటర్ఫేస్లో యానిమేషన్లు, బ్లర్ ఎఫెక్ట్స్ చాలా సున్నితంగా ఉన్నాయి. లాక్ స్క్రీన్‌పై కొత్త క్లాక్ స్టైల్స్, వాతావరణానికి అనుగుణంగా మారే వాల్పేపర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. భద్రత పరంగా 'నాక్స్ మ్యాట్రిక్స్' (Knox Matrix), కొత్త యాంటీ-థెఫ్ట్ ఫీచర్లను జోడించింది. ముఖ్యంగా క్విక్ షేర్ (Quick Share) ఇప్పుడు ఆపిల్ పరికరాలతో కూడా సమర్థవంతంగా పనిచేయడం విశేషం. శాంసంగ్ హెల్త్ యాప్ కూడా ఇప్పుడు మీ వ్యాయామ వివరాలను మరింత లోతుగా విశ్లేషించి నివేదికలను అందిస్తుంది.




