Satya Nadella: ఏఐ నియంత్రణపై సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు

Satya Nadella: మానవాళికి ఉపయోగపడని ఏఐ అభివృద్ధి అనవసరమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. ఏఐ నియంత్రణపై కీలక వ్యాఖ్యలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Sept 2026 11:29 AM IST
Satya Nadella
X

Satya Nadella: ఏఐ నియంత్రణపై సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు

Satya Nadella: కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న కొద్దీ.. దాని దుర్వినియోగం, సైబర్ దాడులు, జీవాయుధ పరిశోధనల రూపంలో ఎదురవుతున్న ముప్పులపై అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధి వేగానికి కళ్లెం వేయాలని, మానవ నియంత్రణలోనే సాంకేతికత ఉండాలని దిగ్గజ టెక్ సంస్థ 'మైక్రోసాఫ్ట్' సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా ఒక కీలక సందేశాన్ని పంచుకున్నారు.

"మనం అభివృద్ధి చేస్తున్న కృత్రిమ మేధ మానవాళికి ఉపయోగపడకపోతే, మనుషుల నియంత్రణ దాటిపోతే దానిపై మరింత దృష్టి పెట్టడంలో ఎలాంటి అర్థం లేదు" అని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఏఐ మోడళ్ల భద్రత, రక్షణ చర్యలు పెంచేందుకు లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌, ఎక్స్‌ఏఐ అధిపతి ఎలాన్‌మస్క్ వంటి ప్రముఖులు ఏఐ వల్ల మానవాళికి పొంచి ఉన్న ప్రమాదాలపై హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల కూడా ఈ వాదనకు పూర్తి మద్దతు ప్రకటించడంతో ఏఐ నియంత్రణ, భద్రత అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మరింత తీవ్రరూపం దాల్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్