New Launches : సెప్టెంబర్‌లో గ్యాడ్జెట్లు, కార్ల హంగామా.. ఇవిగో కొత్త లాంచ్‌లు

ఈ సెప్టెంబర్ నెల టెక్ ప్రేమికులతో పాటు ఆటోమొబైల్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. మార్కెట్లో అడుగుపెట్టబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు

G Krishna
Published on: 14 Sept 2026 12:49 PM IST
New-Launches
X

New-Launches

ఈ సెప్టెంబర్ నెల టెక్ ప్రేమికులతో పాటు ఆటోమొబైల్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. మార్కెట్లో అడుగుపెట్టబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు భవిష్యత్తు వాహన విభాగాన్ని శాసించే విద్యుత్, హైబ్రిడ్ కార్లు భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బైల్ రంగంలో సరికొత్త ఫీచర్లతో ప్రముఖ బ్రాండ్లు తమ కొత్త మోడళ్లను రేసులోకి దించుతున్నాయి. సెప్టెంబరు 15న లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్‌లోని ప్రో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4, అలాగే మాక్స్ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్లను అందించారు. ఇందులో రంగులు మారే 'సీక్రెట్ సన్‌షైన్' మెటీరియల్, IP69K వాటర్ ప్రూఫ్ రేటింగ్, 5-స్టార్ టైటాన్ క్వాలిటీ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, దాదాపు 4 రోజుల కంటే ఎక్కువ వస్తుందని చెప్తున్న భారీ 10,000mAh బ్యాటరీ , 50MP డ్యూయల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

మరోవైపు సెప్టెంబరు 16న మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో K14 లైట్ రానుంది. ఇందులో 6 సంవత్సరాల సుదీర్ఘ లైఫ్ క్లెయిమ్‌తో 7,000mAh బ్యాటరీ, కలర్OS 16, 6.75-అంగుళాల 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా, IP64 ప్రొటెక్షన్, 4+4 GB RAM , వెట్-హ్యాండ్ టచ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇచ్చారు. అలాగే సెప్టెంబరు 18న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో లావా బోల్డ్ N4 ప్రో 5G విడుదల కానుంది. ఇది గోల్డ్, బ్లూ రంగులతో ఫ్లాట్ డిజైన్, 6000mAh బ్యాటరీ , 50MP ప్రైమరీ కెమెరాతో రాబోతోంది. ఆడియో రంగంలో ప్రసిద్ధి చెందిన మివి సంస్థ తన మొదటి స్మార్ట్‌ఫోన్ 'మివి వన్ 5G' ని సెప్టెంబరు 24న ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేయనుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఓఎస్, డ్యూయల్ కెమెరా, 128GB స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ బర్గండీ, బ్లూ, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

ఆటోమొబైల్ విభాగంలో హెవీ పవర్ & డిజైన్స్

స్మార్ట్‌ఫోన్లతో పాటు ఆటోమొబైల్ రంగంలో కూడా సరికొత్త డిజైన్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లతో పలు కార్లు మార్కెట్లో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాయి. టాటా మోటార్స్ తన ప్రాచుర్యం పొందిన టిగోర్, టిగోర్ ఇవి ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో సరికొత్త రెక్టాంగులర్ హెడ్‌ల్యాంప్స్, క్లీన్ బంపర్ డిజైన్ , 10.25-అంగుళాల లార్జ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేస్తోంది. అదే విధంగా మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ కూడా మోడర్న్ లుక్ కోసం రెడ్ యాసెంట్స్ , పవర్‌ఫుల్ 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌తో ముందుకు రాబోతోంది.

భవిష్యత్తును మార్చే ఎలక్ట్రిక్ & హైబ్రిడ్ కార్లు

ఇక ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల విభాగంలో బివైడి సీల్ U (PHEV) ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఫుల్ ట్యాంక్ , పూర్తి ఛార్జింగ్‌పై ఏకంగా 1200 km కంటే ఎక్కువ రేంజ్ ఇస్తూ, దీని ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ కేవలం 5.9 సెకన్లలోనే 0-100 kmph వేగాన్ని అందుకునేలా డిజైన్ చేశారు. జెఎస్‌డబ్ల్యు మోటార్స్ నుంచి రానున్న Jaecoo J5 ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 19-అంగుళాల అలాయ్ వీల్స్, 14.8-అంగుళాల వెర్టికల్ టచ్‌స్క్రీన్, 540-డిగ్రీ కెమెరా , అడ్వాన్స్‌డ్ లెవెల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు పొందుపరిచారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ ఆఫ్-రోడింగ్ విభాగంలో మహీంద్రా 2028 నాటికి విజన్ T కాన్సెప్ట్ ఆధారంగా డ్యూయల్-మోటార్ AWD ఎలక్ట్రిక్ ఆఫ్‌-రోడర్ ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త లాంచ్‌లు టెక్ , ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.