Network Connectivity : సిమ్ కార్డు మారిస్తే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా? అసలు నిజమేంటంటే.!
Network Connectivity : మన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పదే పదే తగ్గిపోతున్నప్పుడు, మనం వెంటనే ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ చెక్ చేయడం లేదా డేటా ప్యాక్
Network-Connectivity
Network Connectivity : మన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పదే పదే తగ్గిపోతున్నప్పుడు, మనం వెంటనే ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ చెక్ చేయడం లేదా డేటా ప్యాక్ అయిపోయిందేమో అని అనుకోవడం చేస్తుంటాం. అయితే ఈ ప్రాసెస్ లో మన మనసులో తరచుగా వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే.. పాత సిమ్ కార్డు తీసేసి కొత్త సిమ్ వేస్తే ఇంటర్నెట్ స్పీడ్ ఏమైనా పెరుగుతుందా? కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో దీనికి ఆన్సర్ 'యస్' కావచ్చు. కానీ కేవలం సిమ్ కార్డు మార్చినంత మాత్రాన ప్రతీసారీ ఇంటర్నెట్ రాకెట్ స్పీడ్‌తో పనిచేస్తుందని అనుకుంటే పొరపాటే. దీని వెనుక కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి.
పాత సిమ్ కార్డుతో వచ్చే ప్రాబ్లమ్స్
మీరు ఉపయోగిస్తున్న సిమ్ కార్డు చాలా సంవత్సరాల నాటి పాతదైతే, అది ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ నెట్‌వర్క్ ఫీచర్లకు ప్రాపర్‌గా సపోర్ట్ చేయకపోవచ్చు. ముఖ్యంగా ఈ 4G, 5G డిజిటల్ యుగంలో, మీ పాత సిమ్‌ను కొత్త వర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల బెటర్ నెట్‌వర్క్ కనెక్టివిటీ లభించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు టెలికాం ఆపరేటర్లు ఇస్తున్న మెజారిటీ 4G/5G సిమ్ కార్డులు ఇప్పటికే లేటెస్ట్ టెక్నాలజీకి అనుకూలంగానే పనిచేస్తున్నాయి.
సిమ్ మార్చడం వల్ల స్పీడ్ ఎప్పుడు పెరుగుతుంది?
మీ దగ్గరున్న ప్రెసెంట్ సిమ్ కార్డులో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా, అది బాగా పాతబడిపోయి ఫిజికల్ డ్యామేజ్ అయినా లేదా లేటెస్ట్ నెట్‌వర్క్ బ్యాండ్స్‌కు సపోర్ట్ చేయకపోయినా కొత్త సిమ్ తీసుకోవడం హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు టెలికాం ఆపరేటర్లు మీ మొబైల్ నంబర్‌ను కొత్త నెట్‌వర్క్ ప్రొఫైల్ లేదా లేటెస్ట్ సర్వీసులతో సిస్టమ్‌లో అప్‌డేట్ చేసినప్పుడు, మీరు కొత్త సిమ్ కార్డ్ వేస్తే కనెక్టివిటీ స్పీడ్ అండ్ క్వాలిటీ మెరుగయ్యే అవకాశం ఉంది.
సిమ్ మార్చినా స్పీడ్ పెరగని పరిస్థితులు
ఒకవేళ మీరు ఉన్న ఏరియాలో ఆ పర్టికులర్ టెలికాం నెట్‌వర్క్ కవరేజ్ అసలు సరిగ్గా లేకపోతే, మీరు ఎన్నిసార్లు సిమ్ కార్డు మార్చినా ఇంటర్నెట్ స్పీడ్‌లో ఎలాంటి చేంజ్ ఉండదు. అక్కడ ప్రాబ్లమ్ సిమ్ కార్డులో కాదు, నెట్‌వర్క్ టవర్ కెపాసిటీ లేదా సిగ్నల్ కవరేజ్‌లో ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వేరే నెట్‌వర్క్‌కి మారడం తప్ప సిమ్ కార్డ్ అప్‌డేట్ వల్ల ప్రయోజనం ఉండదు.
5G స్పీడ్ విషయంలో సిమ్ పాత్ర ఎంత?
కొత్త సిమ్ వేస్తే 5G స్పీడ్ బాగా పెరుగుతుందని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. 5G పర్ఫార్మెన్స్ అనేది మెయిన్‌గా మీ ఏరియాలోని 5G నెట్‌వర్క్ కవరేజ్, మీకు దగ్గరలోని టవర్ కెపాసిటీ, నెట్‌వర్క్ ట్రాఫిక్ యూసేజ్, మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న 5G బ్యాండ్స్ , మీరు వాడే డేటా ప్లాన్‌పై డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి సిమ్ మార్చడం అనేది ఒక్కటే పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు. కానీ మీ వద్ద ఉన్నది లోపభూయిష్టమైన లేదా బాగా పాతబడిన సిమ్ అయితే మాత్రం కొత్తది తీసుకోవడం వల్ల మీ కనెక్టివిటీ సమస్యలు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది.




