ఇలా చేస్తే ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 500 మించదు.. తెలుసుకోవాల్సిన విషయాలు.!
Reduce electricity bill: ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి భయపడుతున్నారా? మన ఇంట్లో వాడే చిన్న చిన్న వస్తువులతోనే కరెంట్ బిల్లు ఎలా ఆదా చేసుకోవచ్చో తెలుసా.
ఇలా చేస్తే ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 500 మించదు.. తెలుసుకోవాల్సిన విషయాలు.!
Reduce electricity bill: నెల నెలా ఇంటికి వచ్చే కరెంట్ బిల్లు చూస్తుంటే షాక్ అవుతోందా.? "అసలు మేమేం వాడామని ఇంత బిల్లు వచ్చింది?" అని చాలాసార్లు మనలో మనం అనుకుంటూనే ఉంటాం. నిజమే, ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. ఫోన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు.. ఇలా అన్నీ మన నిత్యావసరాలే. కానీ వీటిని వాడే పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చు.
ముందుగా, ఫోన్ ఛార్జర్ల విషయానికొద్దాం. ఛార్జింగ్ అయిపోగానే ఫోన్ తీసేస్తాం, కానీ ప్లగ్ స్విచ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోతాం. ఇలా వదిలేయడం వల్ల కూడా మనకు తెలియకుండానే కరెంట్ వృథా అవుతుంది. వాడని వస్తువుల ప్లగ్గులు ఎప్పటికప్పుడు తీసేయడం అలవాటు చేసుకోవాలి. ఇక ఇంట్లో సీఎఫ్ఎల్ బల్బులు వాడుతున్నారా? వెంటనే వాటిని ఎల్ఈడీ బల్బులతో మార్చేయండి. ఇది మీకు దీర్ఘకాలంలో చాలా కరెంట్ ఆదా చేస్తుంది.
వాషింగ్ మెషీన్‌ను ప్రతిరోజూ రెండు మూడు బట్టల కోసం వాడే బదులు, వారానికి ఒకసారి మొత్తం బట్టలు కలిపి ఉతకడం మంచిది. అలాగే పగటిపూట ఇంట్లో లైట్లు వేసుకునేకంటే, కిటికీలు తెరిచి సహజమైన వెలుతురును వాడుకోవడం వల్ల కరెంట్ ఆదాతో పాటు, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏసీ, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వాడేటప్పుడు పని అవ్వగానే 'స్లీప్ మోడ్' కాకుండా పూర్తిగా షట్ డౌన్ చేయడం మర్చిపోవద్దు.
అంతేకాదండోయ్, కరెంట్ మీటర్లలో స్లాబ్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకోవాలి. 100 లేదా 200 యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్‌పై పడే ఛార్జీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీటర్ రీడింగ్ గమనిస్తూ, లిమిట్ దాటకుండా జాగ్రత్తపడటం చాలా ముఖ్యం. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు కూడా 5-స్టార్ రేటింగ్ ఉన్నవి కొంటే, కరెంట్ బిల్లు విషయంలో మీ జేబుకు కచ్చితంగా ఊరట లభిస్తుంది.




