బిగ్ అలర్ట్.. దోమల బ్యాట్‌తో ఇలా చేస్తున్నారా.. స్మార్ట్ టీవీ పేలే ప్రమదం..!
Smart TV safety: ప్రస్తుత కాలంలో ఖరీదైన స్మార్ట్ టీవీలు ప్రతి ఇంట్లోనూ అంతర్భాగమయ్యాయి.
బిగ్ అలర్ట్.. దోమల బ్యాట్‌తో ఇలా చేస్తున్నారా.. స్మార్ట్ టీవీ పేలే ప్రమదం..!
Electric Mosquito Racket Damage: సాధారణంగా రాత్రి పూట టీవీ చూస్తున్నప్పుడు దోమలు ఇబ్బంది పెడితే, చాలామంది వెంటనే ఎలక్ట్రిక్ రాకెట్ (బగ్ జాపర్) ఉపయోగిస్తుంటారు. ఈ బ్యాట్ దోమలను చంపే సమయంలో అధిక వోల్టేజ్ విద్యుత్ ప్రవాహం (స్పార్క్) విడుదల అవుతుంది. ఈ ప్రక్రియలో మన కంటికి కనిపించని అతి చిన్న విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయి. స్మార్ట్ టీవీలలో ఉండే సెన్సిటివ్ సర్క్యూట్లు, మదర్‌బోర్డులు, డిస్‌ప్లే ప్యానెల్స్ ఈ తరంగాల పట్ల అత్యంత సున్నితంగా ఉంటాయి. టీవీకి అతి సమీపంలో ఈ తరంగాలు పదేపదే విడుదలవ్వడం వల్ల అంతర్గత భాగాలు దెబ్బతిని టీవీ అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా స్క్రీన్ బ్లాంక్ కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఎల్‌జీ అధికారిక హెచ్చరిక..
ఎల్‌జీ సంస్థ తన స్మార్ట్ టీవీ వినియోగదారుల మాన్యువల్‌లో ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీవీ పరిసరాల్లో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ పరికరాలను, ముఖ్యంగా దోమలను చంపే బ్యాట్లను వాడకూడదని కంపెనీ స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల ఉత్పత్తి పనితీరు మందగించడమే కాకుండా, టీవీ పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నేటి కాలంలోని ఓఎల్ఈడీ, ఎల్‌ఈడీ టీవీల్లో ఉండే నాజూకైన ఎలక్ట్రానిక్ భాగాలు ఈ విద్యుత్ ప్రేరణల వల్ల త్వరగా పాడైపోతాయి.
స్క్రీన్‌పై దోమ కూర్చుంటే ఏం చేయాలి?
చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, టీవీ స్క్రీన్‌పై దోమ కూర్చున్నప్పుడు నేరుగా బ్యాట్‌తో దానిని కొట్టడం. దీనివల్ల టీవీ ప్యానెల్ ఒక్క క్షణంలోనే కాలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ స్క్రీన్‌పై దోమ ఉంటే, మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్‌తో దానిని సున్నితంగా పక్కకు జరపాలి లేదా గాలితో ఊది పంపించేయాలి. అంతేకాకుండా, టీవీకి పక్కనే ఉన్న సాకెట్లలో ఈ బ్యాట్లను ఛార్జింగ్ పెట్టడం కూడా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.
మీ స్మార్ట్ టీవీ భద్రత కోసం చిట్కాలు..
మీరు కష్టపడి కొనుక్కున్న ఖరీదైన స్మార్ట్ టీవీని దీర్ఘకాలం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దోమల బ్యాట్‌ను టీవీకి కనీసం రెండు నుంచి మూడు అడుగుల దూరంలో మాత్రమే ఉపయోగించాలి. టీవీకి నాణ్యమైన సర్జ్ ప్రొటెక్టర్ లేదా స్టెబిలైజర్‌ను అమర్చడం ద్వారా విద్యుత్ హెచ్చుతగ్గుల నుంచి మదర్‌బోర్డును రక్షించుకోవచ్చు. చిన్నపాటి అజాగ్రత్త వేల రూపాయల నష్టానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి.




