Smartwatch vs Fitness Band: స్మార్ట్ వాచ్‌కి, ఫిట్‌నెస్ బ్యాండ్‌కి మధ్య తేడా ఏంటో తెలుసా?
Smartwatch vs Fitness Band: ఈ రోజుల్లో ఫిట్‌నెస్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది.
Smartwatch vs Fitness Band: స్మార్ట్ వాచ్‌కి, ఫిట్‌నెస్ బ్యాండ్‌కి మధ్య తేడా ఏంటో తెలుసా?
Smartwatch vs Fitness Band: ఈ రోజుల్లో ఫిట్‌నెస్, స్మార్ట్ గ్యాడ్జెట్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం, కాల్స్ చూడడం, నోటిఫికేషన్స్ చెక్ చేయడం కోసం చాలా మంది స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్ కొనాలని అనుకుంటున్నారు. అయితే ఈ రెండూ ఒకటి కాదని మీకు తెలుసా.?
ఫిట్‌నెస్ బ్యాండ్ అంటే ఏమిటి?
ఫిట్‌నెస్ బ్యాండ్ ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి రూపొందించారు. ఇది తేలికగా, స్లిమ్ డిజైన్‌లో ఉంటుంది కాబట్టి రోజంతా ధరించడం సులభం. ఇందులో స్టెప్ కౌంట్, హార్ట్ రేట్ మానిటర్, క్యాలరీ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, వర్కౌట్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారికి ఇది సరైన ఎంపికగా భావిస్తారు.
స్మార్ట్‌వాచ్‌లో ప్రత్యేకత ఏమిటి?
స్మార్ట్‌వాచ్ కేవలం ఫిట్‌నెస్ ట్రాకర్ మాత్రమే కాదు, చిన్న స్మార్ట్ డివైస్‌లా కూడా పనిచేస్తుంది. ఇందులో కాలింగ్, మెసేజ్ నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్, GPS, కెమెరా కంట్రోల్, యాప్ సపోర్ట్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. కొన్ని మోడల్స్‌లో బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్, ఏఐ ఆధారిత హెల్త్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. పెద్ద డిస్‌ప్లే కారణంగా ఉపయోగించడం కూడా సౌకర్యంగా ఉంటుంది.
బ్యాటరీ, డిజైన్‌లో తేడా
ఫిట్‌నెస్ బ్యాండ్‌లలో ప్రధాన ప్లస్ పాయింట్ బ్యాటరీ బ్యాకప్. ఒక్కసారి చార్జ్ చేస్తే 7 నుంచి 14 రోజుల వరకు పని చేస్తాయి. కానీ స్మార్ట్‌వాచ్‌లో ఎక్కువ ఫీచర్లు, పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. సాధారణంగా 2 నుంచి 5 రోజులకోసారి చార్జ్ చేయాల్సి ఉంటుంది. డిజైన్ పరంగా చూస్తే స్మార్ట్‌వాచ్‌లు ప్రీమియం లుక్ ఇస్తాయి. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు మాత్రం సాధారణ, తేలికైన డిజైన్‌తో ఉంటాయి.
ధరలో ఏది తక్కువ?
బడ్జెట్ తక్కువగా ఉంటే ఫిట్‌నెస్ బ్యాండ్ మంచి ఎంపిక అవుతుంది. మార్కెట్‌లో తక్కువ ధరలో మంచి ఫిట్‌నెస్ బ్యాండ్లు లభిస్తున్నాయి. స్మార్ట్‌వాచ్‌ల ధర మాత్రం బ్రాండ్, ఫీచర్ల ఆధారంగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు తక్కువ ధరలో కూడా స్మార్ట్‌వాచ్‌లను తీసుకొస్తున్నాయి. అయినా సాధారణంగా ఫిట్‌నెస్ బ్యాండ్‌లే చౌకగా ఉంటాయి.
మీకు ఏది సరైన ఎంపిక?
మీ ప్రధాన అవసరం ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్టెప్స్ కౌంట్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే ఫిట్‌నెస్ బ్యాండ్ కొనడం మంచిది. కానీ కాలింగ్, నోటిఫికేషన్స్, స్మార్ట్ ఫీచర్లు కూడా కావాలంటే స్మార్ట్‌వాచ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు మీ అవసరం, బడ్జెట్, రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.




