Sony Headphones: ఈ హెడ్‌ఫోన్ ధర అక్షరాల రూ. 63 వేలు.. అంతలా ఏం ఫీచర్లు ఉన్నాయనేగా
Sony Headphones: సోనీ తన ప్రసిద్ధ 1000ఎక్స్ సిరీస్‌కు 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కొత్త వైర్లెస్ హెడ్‌ఫోన్ Sony 1000X The Collection ను విడుదల చేసింది.
Sony Headphones: ఈ హెడ్‌ఫోన్ ధర అక్షరాల రూ. 63 వేలు.. అంతలా ఏం ఫీచర్లు ఉన్నాయనేగా
Sony Headphones: సోనీ తన ప్రసిద్ధ 1000ఎక్స్ సిరీస్‌కు 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కొత్త ప్రీమియం వైర్లెస్ హెడ్‌ఫోన్ Sony 1000X The Collection ను విడుదల చేసింది. రూ. 63 వేల ధరతో అందుబాటులో ఉన్న ఈ హెడ్‌ఫోన్స్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.
1000ఎక్స్ సిరీస్‌కు ప్రత్యేక ఎడిషన్
సోనీ 1000ఎక్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈ సిరీస్ ప్రారంభమై పదేళ్లు పూర్తైన సందర్భంగా కంపెనీ “1000X The Collection” పేరుతో ప్రత్యేక మోడల్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు వచ్చిన 1000ఎక్స్ హెడ్ఫోన్లలో అత్యంత ప్రీమియం వెర్షన్‌గా సోనీ పేర్కొంది.
ధర ఎంత? ఏ రంగుల్లో లభ్యం?
Sony 1000X The Collection హెడ్‌ఫోన్ ధర అమెరికాలో 649.99 డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.63,000 ఉంటుంది. ఈ హెడ్‌ఫోన్ ప్లాటినమ్, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. బాక్స్‌లో హెడ్‌ఫోన్‌తో పాటు క్యారీ కేస్, 1.2 మీటర్ల డిటాచబుల్ ఆడియో కేబుల్ కూడా అందిస్తారు.
ప్రీమియం డిజైన్‌తో ఆకట్టుకునే లుక్
ఈ హెడ్‌ఫోన్‌ను ప్రీమియం ఫినిషింగ్‌తో రూపొందించారు. మెటల్ యాక్సెంట్లు, హ్యాండ్ పాలిష్ ఫినిష్, సాఫ్ట్ వెగన్ లెదర్ కవరింగ్ కారణంగా ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో కొత్తగా రూపొందించిన 30ఎంఎం డైనమిక్ డ్రైవర్లు అమర్చారు. కార్బన్ కంపోజిట్ డోమ్, సాఫ్ట్ ఎడ్జ్ డిజైన్ వాడటంతో వోకల్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి. సంగీతంలోని ప్రతి వాయిద్యం శబ్దం విడివిడిగా వినిపించేలా ట్యూనింగ్ చేశారు. హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కూడా మరింత క్లియర్‌గా వినిపిస్తాయని కంపెనీ చెబుతోంది. దీర్ఘకాలం ఉపయోగించినా అసౌకర్యం కలగకుండా వెడల్పాటి కుషన్ హెడ్‌బ్యాండ్, కొత్త డిజైన్ ఇయర్కప్స్ను అందించారు. దీని బరువు సుమారు 320 గ్రాములు.
AI ఆధారిత DSEE Ultimate, 360 రియాలిటీ ఆడియో
ఈ హెడ్‌ఫోన్‌లో సోనీ తొలిసారిగా DSEE Ultimate టెక్నాలజీని అందించింది. ఇది AI సహాయంతో కాంప్రెస్డ్ మ్యూజిక్ ఫైళ్లలో కోల్పోయిన సౌండ్ డీటెయిల్స్‌ను గుర్తించి రియల్‌టైమ్‌లో పునరుద్ధరిస్తుంది. దీంతో పాటలు మరింత సహజంగా, స్పష్టంగా వినిపిస్తాయి. అలాగే 360 రియాలిటీ ఆడియో అప్మిక్స్ ఫీచర్ కూడా ఉంది. మ్యూజిక్, సినిమాలు, గేమింగ్ కోసం ప్రత్యేక మోడ్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు హెడ్ఫోన్పై ఉన్న ప్రత్యేక బటన్ ద్వారా ఈ మోడ్‌లను సులభంగా మార్చుకోవచ్చు.
శక్తివంతమైన నాయిస్ క్యాన్సిలేషన్, భారీ బ్యాటరీ
Sony 1000X The Collectionలో 12 మైక్రోఫోన్లు కలిగిన అడ్వాన్స్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సిస్టమ్‌ను అందించారు. ఇందులో ఉన్న Adaptive NC Optimizer టెక్నాలజీ చుట్టుపక్కల వాతావరణాన్ని గుర్తించి నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని ఆటోమెటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీంతో విమాన ప్రయాణాలు, కార్యాలయాలు లేదా రద్దీ ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే, ANC ఆన్‌లో ఉన్నప్పుడు 24 గంటలు, ANC ఆఫ్‌లో ఉంటే 32 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని సోనీ తెలిపింది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 6.0, మల్టీపాయింట్ కనెక్టివిటీ సపోర్ట్ అందించారు. అలాగే SBC, AAC, LDAC, LC3 ఆడియో కోడెక్స్‌కు మద్దతు ఉంది. వైర్లెస్ కనెక్షన్ పరిధి సుమారు 10 మీటర్లు ఉంటుంది.




