iPhone: ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి మారడం చాలా ఈజీ.! ఇదిగో అద్భుతమైన ఫీచర్..

iPhone: స్మార్ట్‌ఫోన్ మారుస్తున్న వినియోగదారుల కోసం గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సరికొత్త మైగ్రేషన్ టూల్‌ను పరిచయం చేసింది. ఐఫోన్ నుంచి వైర్‌లెస్ ద్వారా మరింత సులభంగా డేటాను బదిలీ చేసే ఈ అప్‌డేట్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Ravi
By Ravi
Published on: 2 Aug 2026 8:31 PM IST
iPhone
X

iPhone: ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి మారడం చాలా ఈజీ.! ఇదిగో అద్భుతమైన ఫీచర్..

iPhone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కి మారడం అనేది ఇప్పటివరకు కొంత క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ వదిలి ఆండ్రాయిడ్ ఫోన్‌కి మారాలనుకునే యూజర్లు తమ పాత డేటాను కాపీ చేసుకోవడానికి ప్రత్యేకమైన యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌లో సరికొత్త, అత్యంత సులువైన మైగ్రేషన్ అనుభవాన్ని తీసుకువచ్చింది. ఎలాంటి అదనపు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఐఫోన్ నుంచి నేరుగా డేటాను వైర్‌లెస్ పద్ధతిలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌కి మార్చుకునే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ అధికారికంగా పరిచయం చేసింది.

సాధారణంగా ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, మెసేజ్‌లు మాత్రమే బదిలీ అయ్యే పాత పద్ధతులకు భిన్నంగా, ఆండ్రాయిడ్ 17 ద్వారా మరింత విస్తృతమైన డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్ పుణ్యమా అని యూజర్లు తమ గూగుల్ అకౌంట్ వివరాలు, సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, వై-ఫై క్రెడెన్షియల్స్‌తో పాటు ఈ-సిమ్ సమాచారాన్ని కూడా వైర్‌లెస్ ద్వారా సులభంగా బదిలీ చేయవచ్చని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు. కొత్త ఫోన్ సెటప్ చేసే సమయంలో ఐఫోన్ నుంచి డేటాను కాపీ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ ఏర్పడుతుంది. దీని ద్వారా రెండు డివైజ్‌లు కనెక్ట్ అయి సురక్షితంగా డేటా మైగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్ గూగుల్ పిక్సెల్ డివైజ్‌లతో పాటు శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లయిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 మోడళ్లలో అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో మరింత విస్తృతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ అప్‌డేట్‌ను విస్తరించనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలనుకునే వినియోగదారులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, డేటా బదిలీ ప్రక్రియను ఇది పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story