QR Code: డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న క్యూఆర్ కోడ్ వెనుక ఎవరూ ఊహించని షాకింగ్ నిజాలు

QR Code: ప్రస్తుతం మనం నిత్య జీవితంలో చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా క్యూఆర్ కోడ్ వాడకాన్ని చూస్తున్నాము.

CR Reddy
Published on: 16 Sept 2026 8:39 AM IST
QR Code
X

QR Code

QR Code: ప్రస్తుతం మనం నిత్య జీవితంలో చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా క్యూఆర్ కోడ్ వాడకాన్ని చూస్తున్నాము. అయితే ఈ క్యూఆర్ కోడ్‌ను సృష్టించిన డెన్సో వేవ్ అనే జపనీస్ కంపెనీ మొదట దీన్ని కేవలం తన ఫ్యాక్టరీలో ఆటోమోటివ్ విడిభాగాలను సులభంగా లేబుల్ చేయడానికి, గుర్తించడానికి మాత్రమే తయారు చేసింది. ఆ తర్వాత కాలంలో ఇది ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది.

క్యూఆర్ కోడ్ సైజ్ ఎలా నిర్ణయిస్తారు?

సాధారణంగా క్యూఆర్ కోడ్ సైజును దాని పూర్తి కొలతల ఆధారంగా కాకుండా, అందులో ఉండే చిన్న చిన్న చతురస్రాకారపు గళ్ళు లేదా మాడ్యూల్స్ ఆధారంగా లెక్కిస్తారు. డెన్సో వేవ్ నిబంధనల ప్రకారం ఒక మాడ్యూల్ కనిష్ట పరిమాణం 0.17 మిమీ వరకు ఉండవచ్చు. ఇక అందరూ వాడే అత్యంత సాధారణమైన స్టాండర్డ్ క్యూఆర్ కోడ్‌లో 21 బై 21 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ లెక్కన అత్యుత్తమ ప్రింటింగ్ క్వాలిటీ, మంచి స్కాన్నర్ సహాయంతో ఈ కోడ్ సైజు సుమారు 3.57 మిమీ (అంటే సుమారు 0.14 అంగుళాలు) వరకు ఉండే అవకాశం ఉంది.

మైక్రో క్యూఆర్ కోడ్‌ల హవా

సాధారణ క్యూఆర్ కోడ్‌లతో పాటు మైక్రో క్యూఆర్ కోడ్‎లు కూడా అందుబాటులో ఉన్నాయి. డెన్సో వేవ్ సంస్థ వీటిని 2004 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి సైజు ప్రతి వైపు 11 నుంచి 17 మాడ్యూల్స్ మధ్యే ఉంటుంది. పరిశోధనల సమయంలో కేవలం 2 మిమీ వెడల్పు ఉన్న మైక్రో క్యూఆర్ కోడ్ కూడా విజయవంతంగా స్కాన్ కావడం విశేషం. అలాగే ఎక్కువ సమాచారాన్ని నిల్వ ఉంచే మరో మైక్రో క్యూఆర్ కోడ్ కేవలం 3 మిమీ సైజులో కూడా అద్భుతంగా పనిచేసింది. ఆధునిక ప్రింటర్లు, స్మార్ట్‌ఫోన్ల టెక్నాలజీ సాయంతో అతి చిన్న సైజులో కూడా వీటిని ప్రింట్ చేసి సులభంగా స్కాన్ చేయవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత చిన్న క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉంది?

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ రికార్డుల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత చిన్న క్యూఆర్ కోడ్ కేవలం 1.977 చదరపు మైక్రోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. ఇది ఎంత చిన్నదంటే మన కంటికి సాధారణంగా అసలు కనిపించనే కనిపించదు. దీన్ని చదవడానికి లేదా స్కాన్ చేయడానికి క్యాలిబ్రేటెడ్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి అత్యంత ప్రత్యేకమైన టెక్నాలజీ అవసరం అవుతుంది. అందుకే ఇది టెక్నాలజీ పరంగా అద్భుతమే అయినప్పటికీ, సామాన్య ప్రజలు దైనందిన జీవితంలో ఉపయోగించడానికి మాత్రం ఇది అంతగా ప్రాక్టికల్ కాదు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.