AI Camera Smartphones: ఫోటోగ్రఫీ ప్రేమికులకు పండగే.. ఏఐ కెమెరాలతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్లు..!

AI Camera Smartphones: అధునాతన ఏఐ ఫీచర్లతో కూడిన ఫోన్ల కోసం చూస్తున్న వారికి ఈ ఐదు మోడళ్లు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తాయి.

Venkat
Published on: 26 July 2026 9:08 PM IST
AI Camera Smartphone
X

AI Camera Smartphones: ఫోటోగ్రఫీ ప్రేమికులకు పండగే.. ఏఐ కెమెరాలతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్లు..!

AI Camera Smartphones: మొబైల్ ఫోటోగ్రఫీ సరికొత్త శిఖరాలకు చేరుకుంది. కేవలం మెగాపిక్సెల్స్ మాత్రమే కాకుండా, కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో కళ్లుచేదిరే ఫోటోలు తీసే స్మార్ట్‌ఫోన్లు విపణిలో సందడి చేస్తున్నాయి. ఐఫోన్ 17 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రాతో పాటు టాప్ ఏఐ కెమెరా ఫీచర్లు కలిగిన ఐదు పవర్ ఫుల్ ఫోన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆపిల్ సరికొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడల్ సిస్టమ్ లెవెల్ ఏఐ సాంకేతికతతో ఫోటోగ్రఫీ అనుభవాన్ని సరికొత్తగా మార్చేసింది. గాడాంధకారంలో సైతం లైటింగ్, ఎక్స్‌పోజర్‌లను ఏఐ తనకు తానుగా అడ్జస్ట్ చేస్తూ సహజ సిద్ధమైన రంగులతో స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది. ఫ్రేమింగ్, సబ్జెక్ట్ ఫోకస్‌ను దానంతట అదే గుర్తించే సీన్ రికగ్నిషన్ ఫీచర్ దీని సొంతం.

శామ్‌సంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా.. 200 మెగాపిక్సెల్స్ ఏఐ మ్యాజిక్

ఫోటోగ్రఫీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మరొక ఫ్లాగ్‌షిప్ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా. 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో పాటు ప్రోవిజువల్ ఇంజిన్, గెలాక్సీ ఏఐ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫోటో అసిస్ట్, ఏఐ జనరేటివ్ ఎడిటింగ్, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (ISP) ద్వారా శబ్ద నివారణ (Noise Reduction) చేసి అత్యుత్తమ ఫోటోలను తీయడంలో ఇది దిట్ట.

వివో X300 ప్రో.. జైస్ ఏఐ టెలిఫోటో ఎక్స్‌సెలెన్స్

ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం వివో కంపెనీ X300 ప్రో మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జైస్ (ZEISS) ఆప్టిక్స్‌తో కలిపి పనిచేసే ఏఐ పోర్ట్రెయిట్ ఇంజిన్, ఏఐ సూపర్ టెలిఫోటో జూమ్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సుదూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చిత్రీకరించడంలో ఈ కెమెరా సిస్టమ్ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది.

గూగుల్ పిక్సెల్ 10, ఒప్పో ఫైండ్ X9 ప్రో

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ టెన్సార్ G5 చిప్, జెమిని మోడల్స్ సాయంతో పని చేసే ఏఐ కెమెరా కోచ్‌ను కలిగి ఉంది. ఫోటోలు తీసేటప్పుడు లైటింగ్, యాంగిల్స్‌పై ఇది రియల్ టైమ్ సూచనలు ఇస్తుంది. ఒప్పో ఫైండ్ X9 ప్రో మోడల్ హాసెల్‌బ్లాడ్ టెక్నాలజీతో 120x ఏఐ టెలిస్కోపిక్ జూమ్, డీటైల్ మోషన్ స్నాప్‌షాట్ ఫీచర్లను అందిస్తూ అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తోంది.

హార్డ్‌వేర్ బలానికి ఏఐ సాంకేతికత తోడవడంతో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు డిఎస్ఎల్ఆర్ (DSLR) కెమెరాలకు సవాల్ విసురుతున్నాయి. అధునాతన ఏఐ ఫీచర్లతో కూడిన ఫోన్ల కోసం చూస్తున్న వారికి ఈ ఐదు మోడళ్లు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story