UPI AutoPay: మీకు తెలియకుండానే మీ ఫోన్‌పేలో డబ్బులు కట్ అవుతున్నాయా.? వెంటనే ఇలా చేయండి
UPI AutoPay: ప్రస్తుతం చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు, హెల్త్ యాప్‌లు, ఎడ్యుకేషన్ యాప్‌లు, మ్యూజిక్ సర్వీసులు వంటి వాటిలో 7 రోజులు లేదా 30 రోజుల ఉచిత ట్రయల్‌ను ఉపయోగిస్తున్నారు.
UPI AutoPay: మీకు తెలియకుండానే మీ ఫోన్‌పేలో డబ్బులు కట్ అవుతున్నాయా.? వెంటనే ఇలా చేయండి
UPI AutoPay: ప్రస్తుతం చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు, హెల్త్ యాప్‌లు, ఎడ్యుకేషన్ యాప్‌లు, మ్యూజిక్ సర్వీసులు వంటి వాటిలో 7 రోజులు లేదా 30 రోజుల ఉచిత ట్రయల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ట్రయల్ ముగిసిన తర్వాత తమకు తెలియకుండానే ప్రతి నెలా అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. దీనికి కారణం యూపీఐ ఆటోపే ఆప్షన్.
UPI AutoPay అంటే ఏమిటి?
యూపీఐ ఆటోపే అనేది ఒకసారి మీరు అనుమతి ఇస్తే, నిర్ణయించిన తేదీన మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు చెల్లించే సదుపాయం. ప్రతి నెలా లేదా నిర్ణీత వ్యవధిలో సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.
ఈ విధానాన్ని సాధారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఆన్‌లైన్ కోర్సులు, హెల్త్, ఫిట్‌నెస్ యాప్‌లలో ఈ ఆప్షన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సేవను ఉపయోగించడం ఆపేసినా AutoPay క్యాన్సిల్ చేయకపోతే డబ్బులు మాత్రం కట్ అవుతూనే ఉంటాయి.
తెలియకుండానే డబ్బులు ఎందుకు కట్ అవుతాయి?
చాలా మంది ఫ్రీ ట్రయల్ తీసుకునే సమయంలో యాప్‌లో వచ్చే నిబంధనలు పూర్తిగా చదవకుండా "Agree", "Continue" లేదా "Accept" బటన్‌లపై క్లిక్ చేస్తారు. ఆ సమయంలోనే UPI AutoPayకు కూడా అనుమతి ఇచ్చినట్లవుతుంది. ట్రయల్ గడువు ముగిసిన తర్వాత సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు ప్రతి నెలా ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. మొత్తం తక్కువగా ఉండటం వల్ల చాలా మందికి నెలల తరబడి ఈ విషయం కూడా తెలియకుండా ఉంటుంది.
మీ పేరుపై ఎన్ని UPI AutoPayలు యాక్టివ్‌లో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి?
మీ బ్యాంకు ఖాతా నుంచి అనుమానం లేకుండానే డబ్బులు కట్ అవుతున్నాయనిపిస్తే వెంటనే యాక్టివ్ UPI Mandatesను పరిశీలించాలి. ఇందుకోసం NPCI UPI Help Portalలోకి వెళ్లండి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీ పేరుపై యాక్టివ్‌లో ఉన్న అన్ని UPI Mandates కనిపిస్తాయి. అవసరం లేని వాటిని Revoke లేదా Cancel చేసి నిలిపివేయవచ్చు. ఒకవేళ పోర్టల్‌లో ఆప్షన్ కనిపించకపోతే, మీరు ఉపయోగిస్తున్న UPI యాప్‌లో కూడా దీనిని రద్దు చేయవచ్చు.
ఫోన్‌పే వంటి యాప్స్‌లో ఆటోపే ఎలా నిలిపివేయాలి?
మీరు ఉపయోగిస్తున్న UPI యాప్‌లోని AutoPay లేదా Mandates విభాగంలోకి వెళ్లి యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్లను చూడవచ్చు. అక్కడ అవసరం లేని Mandateను ఎంపిక చేసి Cancel, Revoke లేదా Disable ఆప్షన్‌ను ఎంచుకుంటే ఆటోమేటిక్ డెబిట్ ఆగిపోతుంది. ఈ ఆప్షన్ PhonePe, Google Pay, BHIM, Paytm వంటి ప్రముఖ UPI యాప్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఆటో డెబిట్‌ల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి.?
భవిష్యత్తులో అనవసరంగా డబ్బులు కట్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.
ఫ్రీ ట్రయల్ ప్రారంభించే ముందు నిబంధనలు పూర్తిగా చదవండి. అవసరం లేకపోతే UPI AutoPayకు అనుమతి ఇవ్వొద్దు. ప్రతి నెలా బ్యాంకు స్టేట్‌మెంట్‌ను పరిశీలించండి. ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్లను వెంటనే రద్దు చేయండి. UPI యాప్‌లో యాక్టివ్ Mandatesను తరచూ చెక్ చేయండి. చిన్న మొత్తాలే అయినా ప్రతి నెలా ఆటోమేటిక్‌గా కట్ అవుతుంటే ఏడాది చివరికి అది పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే UPI AutoPayలను ఎప్పటికప్పుడు పరిశీలించడం ద్వారా అనవసర ఖర్చులను నివారించవచ్చు.




