ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా.. త్వరలో మీకో గుడ్ న్యూస్.. అదేంటంటే?
Vivo OriginOS 7: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో తమ వినియోగదారుల కోసం సరికొత్త ఒరిజిన్ఓఎస్ 7 అప్‌డేట్ టైమ్‌లైన్‌ను ప్రకటించింది.
ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా.. త్వరలో మీకో గుడ్ న్యూస్.. అదేంటంటే?
Vivo OriginOS 7: టెక్ రంగంలో దూసుకుపోతున్న వివో సంస్థ భారత్‌లో ఇటీవల ఎక్స్ ఫోల్డ్ 6, వి80, ఎస్2 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్‌లను మంగళవారం లాంచ్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్ సందర్భంగానే ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 7 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ షెడ్యూల్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా వివో ఎక్స్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు తొలుత ఈ అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఎక్స్ సిరీస్‌లోని కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌తో ఈ రోల్‌అవుట్ ప్రారంభమవుతుంది.
ఈ అప్‌డేట్ షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 2026 చివరి నాటికి వివో ఎక్స్ ఫోల్డ్ 5, ఎక్స్300 అల్ట్రా, ఎక్స్300 ప్రో, ఎక్స్300, ఎక్స్300 ఎఫ్ఈ ఫోన్‌లకు అప్‌డేట్ వస్తుంది. ఆ తర్వాత నవంబర్ మధ్యలో ఎక్స్200 సిరీస్ ఫోన్‌లు, డిసెంబర్ మధ్యలో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో, ఎక్స్100 సిరీస్, వి70, వి60 సిరీస్ ఫోన్‌లకు అప్‌డేట్ లభిస్తుంది. డిసెంబర్ చివరి నాటికి వి50 సిరీస్, జనవరి 2027 చివరి నాటికి వి40, ఎస్52, టి5, టి4 సిరీస్ ఫోన్‌లు, అలాగే ఫిబ్రవరి 2027 చివరి నాటికి వి30, వై సిరీస్‌కు చెందిన పలు ఫోన్‌లకు ఈ అప్‌డేట్ అందనుంది.
ఇక ఈ కొత్త ఒరిజిన్ఓఎస్ 7 ఇంటర్‌ఫేస్ అనేక సరికొత్త ఫీచర్లతో వస్తోంది. యానిమేషన్ల కోసం ఫ్లూయిడ్ మోషన్, సరికొత్త డిజైన్, డైనమిక్ ట్రాన్స్‌లూసెంట్ మెటీరియల్, జోవి ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే లాక్-స్క్రీన్ కస్టమైజేషన్ కోసం విగ్లే, గ్లింట్ థీమ్, లాక్ స్క్రీన్‌పై రకరకాలుగా స్పందించే ఏఐ పెట్ పాల్స్, ఒకేసారి ఐదు అప్లికేషన్లతో పనిచేసే ఒరిజిన్ వర్క్‌బెంచ్, ఏఐ క్రాస్-యాప్ డ్రాగ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ అప్‌డేట్‌లో అందించబడ్డాయి.




