80W ఛార్జింగ్, 50MP Sony కెమెరా.. Vivo V40e 5G అదిరింది.!
స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం మార్కెట్‌లోకి వచ్చిన 'వివో V40e 5G' మిడ్-ప్రీమియం కేటగిరీలో గట్టి పోటీనిస్తోంది. ఐ-క్యాచింగ్ డిజైన్, మైండ్ బ్లాకింగ్ ఫీచర్లతో వివో..
vivo v40e 5g
స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం మార్కెట్‌లోకి వచ్చిన 'వివో V40e 5G' మిడ్-ప్రీమియం కేటగిరీలో గట్టి పోటీనిస్తోంది. ఐ-క్యాచింగ్ డిజైన్, మైండ్ బ్లాకింగ్ ఫీచర్లతో వివో ఈ మోడల్‌ను రూపొందించింది. స్లిమ్ 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 7300 ప్రాసెసర్, 50MP సోనీ OIS కెమెరా , 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ డివైజ్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.
కళ్ళు చెదిరే 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే & డిజైన్
వివో V40e 5G లో 6.77 ఇంచుల FHD+ AMOLED 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ రెస్పాన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. అల్ట్రా-స్లిమ్ లుక్‌తో పాటు రాయల్ బ్రాంజ్, మింట్ గ్రీన్ వంటి యూనిక్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా రాయల్‌గా అనిపిస్తుంది.
స్పీడ్ ప్రాసెసర్ .. మల్టీటాస్కింగ్ పెర్ఫార్మెన్స్
ఈ స్మార్ట్‌ఫోన్ లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని అమర్చారు. 8GB ర్యామ్ తో పాటు 128GB , 256GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. హెవీ మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్, గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ వంటి పనులను ఈ ప్రాసెసర్ ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా సులభంగా హ్యాండిల్ చేయగలదు.
సోనీ కెమెరాతో నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ
కెమెరా విషయానికొస్తే.. వెనుక వైపు 50MP సోనీ IMX882 OIS ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ ఏకంగా 50MP ఐ ఆటోఫోకస్ (Eye AF) కెమెరాను ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు ఏఐ పోర్ట్రెయిట్ సూట్, ఏఐ ఎరేజర్, ఆరా లైట్ పోర్ట్రెయిట్ , 4K వీడియో రికార్డింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఫోటోగ్రఫీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
బిగ్ బ్యాటరీ.. 80W లైట్నింగ్ ఫాస్ట్ ఛార్జింగ్
పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్‌లో 5,500mAh బిగ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దీనికి తోడు 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉండటంతో చాలా తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జింగ్ పూర్తవుతుంది. రోజంతా నిరంతరం ఫోన్ వాడే వారికి, ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఇండియా ప్రైసింగ్.. ఆఫర్స్
భారత్‌లో వివో V40e 5G మోడల్ 8GB + 128GB , 8GB + 256GB ఆప్షన్లలో లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో 8GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 24,999 గా ఉంది. వివిధ బ్యాంక్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రీమియమ్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.




