Vivo X Fold 6 : 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. Vivo X Fold 6 రచ్చకు రెడీ!
Vivo X Fold 6 : ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ 'వివో' సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. వివో కంపెనీ తన మోస్ట్ ఎవైటెడ్ ఫోల్డబుల్..
Vivo-X-Fold-6
Vivo X Fold 6 : ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ 'వివో' సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. వివో కంపెనీ తన మోస్ట్ ఎవైటెడ్ ఫోల్డబుల్ ఫోన్ 'వివో X ఫోల్డ్ 6' ను త్వరలోనే చైనా మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్ డేట్‌పై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ, వివో ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలకమైన వివరాలను వెల్లడించింది. మీడియాటెక్‌తో కలిసి వివో ప్రత్యేకంగా రూపొందించిన ఒక పవర్ఫుల్ చిప్సెట్ , అధునాతన ఏఐ (AI) ఫీచర్లతో ఈ ఫోన్ రాబోతోంది. గతంలో వచ్చిన వివో X ఫోల్డ్ 5 కి సక్సెసర్‌గా వస్తున్న ఈ సరికొత్త ఫోల్డబుల్ డివైజ్‌లో ఏకంగా 6,900mAh బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం.
వివో - మీడియాటెక్ సంయుక్తంగా రూపొందించిన స్పెషల్ చిప్
వివో ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బోక్సియావ్ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'వైబో' ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివో X Fold 6 స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎディション చిప్సెట్తో వస్తున్న ప్రపంచంలోనే మొదటి ఫోన్‌గా నిలవబోతోంది. ఇది సాధారణ డైమెన్సిటీ 9500 చిప్సెట్ కంటే చాలా భిన్నమైనది , శక్తివంతమైనది. ఈ స్పెషల్ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను కేవలం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల కోసమే వివో , మీడియాటెక్ సంస్థలు కలిసి దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి కస్టమ్-డెవలప్ చేశాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గత మోడల్‌తో పోలిస్తే పీక్ ఎన్పీయూ పెర్ఫార్మెన్స్ ఏకంగా 111 శాతం పెరుగుతుందని, అలాగే పవర్ కన్జంప్షన్ 56 శాతం వరకు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది డివైజ్‌లోనే అత్యుత్తమమైన ఎడ్జ్ AI పెర్ఫార్మెన్స్ , స్థిరమైన ఏఐ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
నెక్స్ట్ లెవెల్ ఏఐ (AI) ఫీచర్లు
ఈ డైమెన్సిటీ 9500 సూపర్ ఎディション చిప్‌ను ప్రత్యేకంగా ఫోల్డబుల్ ఫోన్ల లార్జ్ డిస్ప్లే , ఏఐ ఫీచర్ల కోసమే డిజైన్ చేశారు. ఈ చిప్సెట్ లోని ఏఐ వాయిస్ ఇంజిన్ వల్ల ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఆఫ్‌లైన్ స్పీచ్ టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ స్పీడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, ఏఐ జనరేటెడ్ సమ్మరీలు మునుపటి కంటే 57 శాతం వేగంగా రీడ్ అవుతాయి. దీనితో పాటు ఏఐ ఫైల్ మేనేజర్ రీజనింగ్ సామర్థ్యాలు, టెక్స్ట్ సమ్మరైజేషన్, ఏఐ పవర్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ ఫంక్షన్స్, , మల్టీటాస్కింగ్ కోసం ఉపయోగపడే 'అటామిక్ వర్క్‌బెంచ్' ఫీచర్లలో ఈ చిప్ అద్భుతమైన మార్పులను తీసుకురాబోతోంది.
అంచనా వేస్తున్న స్పెసిఫికేషన్లు , డిస్ప్లే వివరాలు
సాంకేతిక వివరాల పరంగా చూస్తే, ఈ వివో X ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ సరికొత్త OriginOS 6 Fold ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది. ఇందులో 8-ఇంచుల ఇన్నర్ స్క్రీన్ , 6.51-ఇంచుల ఔటర్ డిస్ప్లే ఉండబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో అత్యంత పవర్ఫుల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్‌తో పాటు, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. వీటన్నింటికీ తోడు ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యంత భారీ బ్యాటరీ అయిన 6,900mAh బ్యాటరీని ఇందులో అమర్చబోతున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి పవర్ఫుల్ బ్యాటరీ, అల్ట్రా-క్లియర్ కెమెరా , మీడియాటెక్ స్పెషల్ ఏఐ చిప్సెట్తో రాబోతున్న ఈ వివో X ఫోల్డ్ 6.. మార్కెట్లోకి వస్తే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




