Vivo X Fold 6: 200MP కెమెరా, 6900mAh బ్యాటరీ.. ధర చూస్తే మైండ్ బ్లాక్!

Vivo X Fold 6 Price in India: వివో ఎక్స్ ఫోల్డ్ 6 (Vivo X Fold 6) భారత్‌లో అడుగుపెట్టింది.

Venkat
Published on: 6 Oct 2026 9:14 PM IST
Vivo X Fold 6
X

Vivo X Fold 6: 200MP కెమెరా, 6900mAh బ్యాటరీ.. ధర చూస్తే మైండ్ బ్లాక్!

Vivo X Fold 6 Price in India: వివో ఎక్స్ ఫోల్డ్ 6 (Vivo X Fold 6) భారత్‌లో అడుగుపెట్టింది. ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విడుదలైన ఈ కొత్త మోడల్ 8.02-అంగుళాల ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 9500 సూపర్ చిప్‌సెట్, 6,900mAh బ్యాటరీ వంటి హైఎండ్ ఫీచర్లతో వచ్చింది. జెసీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 200MP మెయిన్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 12GB RAM, 512GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర రూ.2,19,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 13 నుంచి వివో ఇండియా ఈ స్టోర్ ద్వారా విక్రయాలు మొదలవుతాయి.

Vivo X Fold 6 ధర, ఆఫర్లు..

భారత్‌లో వివో ఎక్స్ ఫోల్డ్ 6 12GB + 512GB కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.2,19,999. న్యూబెలా టీల్, ప్రిజం బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు 30 నెలల ఈజీ ఈఎంఐ ప్లాన్, జీరో డౌన్ పేమెంట్, రూ.26,400 వరకు ఇన్ స్టాంట్ క్యాష్ బ్యాక్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వీ-అప్ గ్రేడ్ ద్వారా 12 శాతం వరకు ఎక్స్ ఛేజ్ బోనస్ కూడా లభిస్తుంది.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు మూడు నెలల గూగుల్ ఏఐ ప్రో (Google AI Pro) సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు.

డిస్‌ప్లేలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు..

ఫోన్‌లో 8.02-అంగుళాల ఫోల్డబుట్ AMOLED స్క్రీన్ ఉంది. ఇది 2,504×2,312 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రీప్రెస్ రేట్, 424ppi డెన్సిటీ, హెచ్డీఆర్ సపోర్ట్ అందిస్తుంది.

స్క్రీన్ 6.51 అంగుళాల AMOLED ప్యానెల్‌తో వచ్చింది. దీనిలో 1,120×2,528 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది.

200MP కెమెరా.. 8K వీడియో..

కెమెరా విభాగంలో Vivo X Fold 6కు జెసీస్ ట్రిపుల్ కెమెరా ఇచ్చారు.

200MP ప్రైమరీ కెమెరా – OIS, f/1.68

50MP అల్ట్రావైడ్ కెమెరా – f/2.05

50MP ఫెరీస్కోప్ కెమెరా – f/2.57

100x డిజిట్ జూమ్

రెండు స్క్రీన్లలో 20MP సెల్ఫీ కెమెరాలు

8K వీడియో రికార్డింగ్

6900mAh బ్యాటరీ.. 80W ఛార్జింగ్..

భారీ ఫోల్డబుల్ డిస్‌ప్లేకు అనుగుణంగా వీవో ఇందులో 6,900mAh బ్యాటరీ ఇచ్చింది. 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఫెర్మార్మెన్స్ కోసం 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 12GB LPDDR5x Ultra RAM, 512GB UFS 4.1 స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజాన్ ఓఎస్ 7పై ఫోన్ పనిచేస్తుంది.

రూ.2 లక్షలకు పైగా ధరతో వచ్చిన Vivo X Fold 6 సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కాదు. భారీ ఫోల్డబుల్ AMOLED స్క్రీన్, 200MP జెసీస్ కెమెరా, 6,900mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, డైమెన్సిటీ 9500 Super చిప్‌సెట్‌తో ప్రీమియం ఫోల్డబుల్ అనుభవాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం. భారత్‌లో అక్టోబర్ 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.