Vivo: కెమెరాతో మార్కెట్ ను షేక్ చేసేందుకు సిద్ధమైన వివో.. స్మార్ట్ ఫోన్ హిస్టరీలోనే తొలిసారి భయ్యో..

Vivo X300 Ultra: చైనా టెక్ దిగ్గజం వివో (Vivo) తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Vivo X300 Ultra, Vivo X300s లాంచ్‌ను అధికారికంగా ప్రకటించింది. కెమెరా టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులతో ఈ ఫోన్లు మార్కెట్‌ను షేక్ చేసే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్లు ఇప్పటికే ఆసక్తి పెంచుతున్నాయి.

Venkata Chari
Published on: 21 March 2026 10:52 AM IST
Vivo
X

Vivo: కెమెరాతో మార్కెట్ ను షేక్ చేసేందుకు సిద్ధమైన వివో.. స్మార్ట్ ఫోన్ హిస్టరీలోనే తొలిసారి భయ్యో..

Vivo X300 Ultra: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివో (Vivo), తన మోస్ట్ అవేటెడ్ X300 సిరీస్‌ లాంచ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబో (Weibo) ద్వారా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 30న సాయంత్రం చైనాలో జరగబోయే ఈ ఈవెంట్‌లో వివో ఎక్స్ 300 అల్ట్రా (Vivo X300 Ultra), వివో ఎక్స్ 300ఎస్ (Vivo X300s) మోడల్స్ సందడి చేయనున్నాయి.

లాంచ్, విక్రయాల వివరాలు..

భారత కాలమానం ప్రకారం మార్చి 30వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా, అదే వేదికపై వివో ప్యాడ్ 6 ప్రో (Vivo Pad 6 Pro) టాబ్లెట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక సేల్స్ విషయానికి వస్తే, ఏప్రిల్ 3 నుంచి ఇవి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్, భారత్‌లో వీటి విడుదలపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Vivo X300 Ultra: ఫోటోగ్రఫీలో సరికొత్త విప్లవం..

ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా 'అల్ట్రా' నిలవనుంది. దీని డిజైన్, కెమెరా ఫీచర్లు టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి:

ప్రీమియం డిజైన్: డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్, ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్, పెద్ద సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌తో ఇది చాలా రిచ్‌గా కనిపిస్తోంది.

సరికొత్త టెక్నాలజీ: ఎప్పటిలాగే Zeiss బ్రాండింగ్‌తో వస్తున్న ఈ కెమెరా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుభూతిని ఇస్తుంది.

కలర్ టెక్నాలజీ: ఇందులో బ్లూ ఫ్రింట్ ఒరిజినల్ కలర్ కెమెరా ( Blueprint Original Colour Camera) టెక్నాలజీని వాడుతున్నారు. 12 స్పెక్ట్రల్ ఛానల్స్ సాయంతో ఫోటోల్లో రంగులు అత్యంత సహజంగా, ఖచ్చితత్వంతో కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ చరిత్రలో ఇదొక రికార్డు అని చెబుతున్నారు.

వివో ఎక్స్ 300 ఎస్ (Vivo X300s)..

స్పీడ్ తోపాటు పెర్ఫార్మెన్స్‌ కోరుకునే వారి కోసం వివో ఎక్స్ 300 ఎస్ (Vivo X300s) సిద్ధమవుతోంది. గీక్‌బెంచ్ లీక్స్‌ ప్రకారం దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ప్రాసెసర్: పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 9500 ( MediaTek Dimensity 9500) చిప్‌సెట్‌తో ఇది పనిచేస్తుంది. దీని ప్రైమ్ కోర్ వేగం 4.21GHz వరకు ఉంటుంది.

మెమరీ: 16జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్ 16(Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది.

కెమెరాలో సత్తా చాటడానికి Vivo X300 Ultra సిద్ధమవుతుంటే, వేగంలో మేటిగా నిలవడానికి X300s వస్తోంది. మార్చి 30న జరిగే అధికారిక లాంచ్ తర్వాత వీటి పూర్తి ధరలు, ఇతర ఫీచర్ల వివరాలు మనకు క్లియర్ గా తెలుస్తాయి.

Venkata Chari

Venkata Chari

Next Story