Vivo X500 Series : వివో X500 సిరీస్ గ్లోబల్ ఎంట్రీ.. 200MP కెమెరాతో రెడీ..!

Vivo X500 Series : ప్రముఖ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'వివో' తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లు అయిన X500 సిరీస్‌ను చైనా మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్

G Krishna
Published on: 14 Sept 2026 5:13 PM IST
Vivo X500 Series : వివో X500 సిరీస్ గ్లోబల్ ఎంట్రీ.. 200MP కెమెరాతో రెడీ..!
X

Vivo X500 Series : ప్రముఖ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'వివో' తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లు అయిన X500 సిరీస్‌ను చైనా మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా బేసిక్ మోడల్ వివో X500తో పాటు X500 ప్రో , అత్యంత శక్తివంతమైన X500 ప్రో మాక్స్ అనే మూడు వెర్షన్లను కంపెనీ పరిచయం చేయబోతోంది. అయితే చైనాలో లాంచ్ కావడానికి ముందే, అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇవి త్వరలోనే విడుదల కానున్నట్లు బలమైన ఆధారాలు లభించాయి.

మలేషియా SIRIM వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం

గ్లోబల్ విడుదలకు సంబంధించిన స్పష్టమైన సూచన ఇస్తూ, ఈ మూడు ఫోన్లు మలేషియాకు చెందిన ప్రముఖ 'స్టాండర్డ్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేషియా' (SIRIM) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. టెక్ నివేదికల ప్రకారం, బేస్ మోడల్ వివో X500 మోడల్ నంబర్ V2619, రెఫరెన్స్ నంబర్ RGQL/46L/0926/S (26-5046)తో నమోదు కాగా, సెప్టెంబరు 7న దీనికి ఆమోదం లభించింది.

అదేవిధంగా టాప్ వేరియంట్ అయిన వివో X500 ప్రో మాక్స్ మోడల్ నంబర్ V2610, సర్టిఫికేట్ నంబర్ RGQL/48L/0926/S (26-5078)తో కనిపించింది. ఇక వివో X500 ప్రో మోడల్ V2621 , సర్టిఫికేషన్ నంబర్ RGQL/50L/0926/S (26-5085)తో నమోదయ్యాయి. ఈ ప్రో మోడళ్లు రెండూ సెప్టెంబరు 10న రిజిస్టర్ అయ్యాయి. ఈ డేటాబేస్ లిస్టింగ్ ఫీచర్లను నేరుగా వెల్లడించకపోయినప్పటికీ, ఆసియా మార్కెట్‌లలో వీటి అధికారిక విడుదల చాలా సమీపంలో ఉందనే సంకేతాన్ని ఇచ్చింది.

పవర్ ఫుల్ ప్రాసెసర్ , ప్రాసెస్ క్లారిటీ

ఈ గ్లోబల్ సిరీస్‌లోని వివో X500 ప్రో మాక్స్ అంతకుముందే 'గీక్‌బెంచ్' (Geekbench) బెంచ్‌మార్క్ సైట్‌లో V2602DA మోడల్ నంబర్‌తో దర్శనమిచ్చింది. ఆ సమాచారం ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ మోస్ట్ పవర్‌ఫుల్ 'డైమెన్సిటీ 9600 ప్రో' చిప్‌సెట్‌తో పాటు ఏకంగా 16GB RAM , ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుందని తెలిసింది.

అద్భుతమైన డిస్‌ప్లే, కెమెరా ఫీచర్లు

సంస్థ విడుదల చేసిన అధికారిక టీజర్ల ప్రకారం, వివో X500 ప్రో మాక్స్ ఫోన్ బిఓఈ (BOE) సంస్థ తయారు చేసిన 6.85-అంగుళాల క్యూ11 (Q11) ప్యానెల్‌తో 2K రెజల్యూషన్ కలిగిన భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా ఆవిష్కరణలకు పేరుగాంచిన వివో, ఈసారి కూడా 'జీస్' (Zeiss) బ్రాండింగ్‌తో అత్యుత్తమ ఫొటోగ్రఫీ సెటప్‌ను ఇస్తోంది. ఇందులో ప్రధానంగా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను పొందుపరిచారు. అంతేకాకుండా, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల కోసం ప్రత్యేకమైన కెమెరా కిట్, టెలికన్వర్టర్ లెన్స్‌ల సపోర్ట్‌ను కూడా ఆప్షనల్‌గా అందించబోతున్నట్లు టీజర్లు స్పష్టం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల గ్లోబల్ ప్రకటన కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.