Vivo Y600s Pro: వారానికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. వివో కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

Vivo Y600s Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తమ కొత్త మోడల్ వివో వై600ఎస్ ప్రోను చైనా మార్కెట్లో విడుదల చేసింది.

CR Reddy
Published on: 9 Oct 2026 9:08 AM IST
Vivo Y600s Pro: వారానికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. వివో కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
X

Vivo Y600s Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తమ కొత్త మోడల్ వివో వై600ఎస్ ప్రోను చైనా మార్కెట్లో విడుదల చేసింది. గతంలో వచ్చిన వై600 సిరీస్ మోడళ్ల విజయం తర్వాత ఈ కొత్త వెర్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రోజంతా ఫోన్ వాడే వారికి, తరచుగా ఛార్జింగ్ పెట్టే ఓపిక లేని వారికి అనువుగా దీనిని తీర్చిదిద్దారు.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని 10,200 mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీ. ఫాస్టుగా ఛార్జ్ కావడానికి వీలుగా 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇతర డివైజ్‌లకు ఛార్జింగ్ ఇచ్చుకునే రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

డిస్‌ప్లే విషయానికొస్తే 6.83 అంగుళాల పెద్ద అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌తో పాటు సెక్యూరిటీ కోసం ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై నడుస్తుంది. 8GB ర్యామ్‌కు అదనంగా మరో 8GB వర్చువల్ ర్యామ్ జోడించుకునే వెసులుబాటు ఉంది.

ఫొటోగ్రఫీ లవర్ల కోసం వెనుక వైపు f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు వైపు వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. రెండింట్లోనూ షేక్ లేకుండా ఫొటోలు తీసేందుకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్లు, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి.

ధర విషయానికి వస్తే 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.38,900గా నిర్ణయించారు. 512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.43,200 వరకు ఉంటుంది. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే మూన్‌లైట్ బ్లాక్, ఫ్లోటింగ్ గోల్డ్, స్టారీ పర్పుల్, వాస్ట్ బ్లూ రంగుల్లో లభిస్తోంది. గతంలో వచ్చిన వై600 ప్రో మోడల్‌కు ఇది దాదాపు రీబ్రాండెడ్ వెర్షన్‌లాగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.