Vi Recharge Price Hike: రూ.40 పెరిగిన 84 రోజుల ప్లాన్.. డేటా ప్రయోజనాలు ఇవే
Vodafone Idea Recharge Price Hike: వోడాఫోన్ ఐడియా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను సైలెంట్‌గా రూ. 899కి పెంచింది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ పూర్తి ప్రయోజనాలు ఇవే.
Vi Recharge Price Hike: రూ.40 పెరిగిన 84 రోజుల ప్లాన్.. డేటా ప్రయోజనాలు ఇవే
Vi Recharge Price Hike: ప్రముఖ టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) తమ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేదా సమాచారం లేకుండానే 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్రముఖ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరను రహస్యంగా పెంచేసింది. ధర పెరిగినప్పటికీ, ప్లాన్ ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
రూ. 859 ప్లాన్ ధర ఎంత పెరిగింది?
వోడాఫోన్ ఐడియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ కొత్త ధరను అప్‌డేట్ చేసింది. ఇప్పటివరకు రూ. 859గా ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ ధరను రూ. 40 పెంచి రూ. 899గా ఖరారు చేసింది. అయితే పాత బెనిఫిట్స్ మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.
రూ. 899 ప్లాన్ ప్రయోజనాలు ఇవే:
డేటా & వ్యాలిడిటీ: ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1.5GB 4G/5G డేటాతో పాటు 84 రోజుల సుదీర్ఘ చెల్లుబాటు (Validity) లభిస్తుంది.
కాలింగ్ & SMS: దేశవ్యాప్తంగా అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ (Unlimited Calls) సౌకర్యంతో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు.
హీరో అన్‌లిమిటెడ్ ఆఫర్లు:
ఉచిత నైట్ డేటా: అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత 5G డేటాను వాడుకోవచ్చు (ఈ డేటా రోజువారీ కోటా నుంచి తగ్గించబడదు).
వీకెండ్ డేటా రోల్‌ఓవర్: వారంలో మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునే సదుపాయం.
డేటా డెలివరీ: Vi యాప్ ద్వారా ప్రతి నెలా అదనపు ఖర్చు లేకుండా 2GB ఉచిత బ్యాకప్ డేటా పొందే అవకాశం.
Vi Movies & TV: స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలలో సినిమాలు, లైవ్ టీవీ షోలు మరియు వార్తలను వీక్షించడానికి ‘Vi Movies & TV’ యాప్ ఉచిత యాక్సెస్.
అత్యంత సరసమైన 5G ప్లాన్ ఇదే!
ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా 84 రోజుల వ్యాలిడిటీతో 9 రకాల ప్లాన్‌లను అందిస్తుండగా.. 84 రోజుల చెల్లుబాటు మరియు 5G డేటానిచ్చే ప్లాన్లలో ఈ రూ. 899 ప్లాన్ అత్యంత తక్కువ ధర కలిగినదిగా నిలిచింది. ఒకవేళ కేవలం 4G కనెక్టివిటీ మరియు అపరిమిత కాలింగ్ మాత్రమే కావాలనుకుంటే 84 రోజుల వ్యాలిడిటీకి రూ. 470 ప్లాన్, కేవలం డేటా కోసం అయితే రూ. 548 ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.




