WhatsApp New Look: ఆండ్రాయిడ్‌లో మారనున్న లుక్.. నావిగేషన్ బార్ ఇక ఫ్లోటింగ్.!
వాట్సాప్ యూజర్లకు వరుసగా కొత్త ఫీచర్లు అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యాప్ లుక్‌ను మరింత మోడ్రన్‌గా మార్చే పనిలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.
WhatsApp Android New Floating Navigation Bar
వాట్సాప్ యూజర్లకు వరుసగా కొత్త ఫీచర్లు అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యాప్ లుక్‌ను మరింత మోడ్రన్‌గా మార్చే పనిలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్‌లోని బాటమ్ నావిగేషన్ బార్‌కు కొత్త డిజైన్‌ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త డిజైన్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ ఇంటర్ఫేస్ లుక్ మరింత స్టైలిష్‌గా మారే అవకాశం ఉంది.
ఫ్లోటింగ్ లుక్‌లో నావిగేషన్ బార్
వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే వాబీటాఇన్ఫో నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త బాటమ్ నావిగేషన్ బార్‌ను కంపెనీ టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతం స్క్రీన్ దిగువ భాగంతో కలిసిపోయినట్లుగా కనిపించే నావిగేషన్ బార్‌కు బదులుగా.. కొత్త డిజైన్‌లో ఇది ప్రత్యేకంగా కనిపించే ఫ్లోటింగ్ లేఅవుట్లో ఉండనుంది. ఈ నావిగేషన్ బార్‌కు రౌండెడ్ కార్నర్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో యాప్ మొత్తం ఇంటర్ఫేస్కు కొత్త లుక్ వచ్చే అవకాశం ఉంది.
లైట్, డార్క్ మోడ్‌లలోనూ
కొత్త బాటమ్ నావిగేషన్ బార్ లైట్, డార్క్ థీమ్లలోనూ కనిపించేలా వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే లైట్ థీమ్‌లో ఈ ఫ్లోటింగ్ డిజైన్ మరింత స్పష్టంగా కనిపించనున్నట్లు ఫీచర్ ట్రాకర్ పేర్కొంది.
ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు
ఆపిల్ ఐఓఎస్‌లో వాట్సాప్ ఇటీవల లిక్విడ్ గ్లాస్ డిజైన్‌కు అనుగుణంగా ఫ్లోటింగ్ ట్యాబ్ బార్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్లో కూడా అదే తరహా ఫ్లోటింగ్ లుక్, రౌండెడ్ ఎడ్జెస్ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఐఓఎస్‌లో కనిపించే ట్రాన్స్లూసెంట్ లుక్‌ను ఆండ్రాయిడ్‌లో కూడా అదే విధంగా తీసుకురాకపోవచ్చని సమాచారం. రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లకు వేర్వేరు డిజైన్ గైడ్‌లైన్స్ ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
యూజర్ల ఫీడ్‌బ్యాక్‌తో మార్పులు?
ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా ఈ డిజైన్ మార్పులకు ఒక కారణం కావచ్చని వాబీటాఇన్ఫో పేర్కొంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌కు మరింత మోడ్రన్ లుక్ ఇవ్వాలని కొంతకాలంగా యూజర్లు కోరుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే బాటమ్ నావిగేషన్ బార్‌తో పాటు భవిష్యత్తులో యాప్‌లో మరిన్ని డిజైన్ మార్పులు కనిపించే అవకాశం ఉంది.
ఇంకా బీటా యూజర్లకు రాలేదు
ప్రస్తుతం ఈ కొత్త డిజైన్ డెవలప్మెంట్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ 2.26.38.10 వెర్షన్లో దీన్ని పరీక్షిస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు బీటా టెస్టర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. ముందుగా కొంతమంది ఎంపిక చేసిన బీటా యూజర్లకు ఈ మార్పును అందించి, వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విస్తృతంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందరికీ వస్తుందనే విషయంపై వాట్సాప్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




