WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ తరహాలో ఆండ్రాయిడ్ కొత్త లుక్

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అదిరిపోయే మార్పులు తీసుకురానుంది.

CR Reddy
Published on: 28 Sept 2026 6:57 AM IST
WhatsApp
X

WhatsApp

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అదిరిపోయే మార్పులు తీసుకురానుంది. ఐఫోన్ యాప్ మాదిరిగానే ఆండ్రాయిడ్‌లో కొత్త ఫ్లోటింగ్ నావిగేషన్ బార్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఈ కొత్త డిజైన్‌లో ట్యాబ్స్ అలాగే కంట్రోల్స్ పూర్తిగా మారిపోనున్నాయి. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై దాదాపు మూడేళ్ల తర్వాత ఈ నేవిగేషన్ బార్ డిజైన్ మారుతుండటం విశేషం. టెక్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ కొత్త లుక్ యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది.

కొత్త ఫ్లోటింగ్ నేవిగేషన్ ప్రత్యేకతలు

మీడియా నివేదికల ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.26.38.10లో ఈ మార్పు కనిపించింది. స్క్రీన్ కింద భాగంలో కనిపించే నావిగేషన్ బార్ ఇప్పుడు మునుపటిలా కాకుండా స్క్రీన్ నుంచి కాస్త పైకి తేలినట్లు కనిపిస్తుంది. దీని మూలలు గుండ్రంగా ఉండటంతో చూడటానికి సరికొత్త ఫ్లోటింగ్ లుక్ వస్తుంది. ఐఫోన్ ఐఓఎస్ డిజైన్‌ను పోలి ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా గూగుల్ ఆండ్రాయిడ్ డిజైన్ గైడ్‌లైన్స్ ప్రకారమే రూపొందించబడింది. లైట్ థీమ్‌లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

బిజినెస్ యూజర్ల కోసం మెటా కొత్త ఏఐ టూల్

సాధారణ యూజర్ల కోసమే కాకుండా బిజినెస్ వాట్సాప్ వాడుతున్న వారికి కూడా మెటా సంస్థ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ను మరింత సులభంగా సెటప్ చేయడానికి కొత్త ఏఐ టూల్‌ను పరిచయం చేసింది. క్లౌడ్ ఏపీఐ రిజిస్ట్రేషన్, బిజినెస్ మేనేజర్ సెట్టింగ్‌లు వంటి సంక్లిష్టమైన పనులను ఇప్పుడు చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ కోడింగ్ టూల్స్ సహాయంతో చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. డెవలపర్లు పదేపదే కన్సోల్ మార్చాల్సిన అవసరం లేకుండా ఏఐ ఏజెంట్ అన్నీ చూసుకుంటుంది.

అకౌంట్ సెటప్ మరింత సులభం

ఈ కొత్త ఏఐ టూల్ సహాయంతో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఫోన్ నంబర్ వెరిఫై చేయడం చిటికెలో అయిపోతుంది. ఒకవేళ బిజినెస్ వెరిఫికేషన్ లేదా పేమెంట్ మెథడ్స్ జోడించడం వంటి ముఖ్యమైన పనులు పెండింగ్‌లో ఉంటే ఈ ఏఐ ఏజెంట్ ముందే గుర్తు చేస్తుంది. అకౌంట్ భద్రత కోసం ఇది ఆథెంటికేషన్ అలాగే పర్మిషన్స్‌ను కూడా పక్కాగా తనిఖీ చేస్తుంది. ఫేస్‌బుక్ లాగిన్ ద్వారా సురక్షితంగా ఈ సేవలను పొందవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్లన్నీ సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.