WhatsApp New Features: వాట్సాప్ గ్రూపుల్లో అదిరిపోయే 4 కొత్త ఫీచర్లు.. ఇక మెసేజ్‌లు ఎప్పటికీ..!

WhatsApp New Features: కొత్తగా గ్రూప్‌లో చేరిన సభ్యులకు పాత మెసేజ్‌లను షేర్ చేయడం, ముఖ్యమైన మెసేజ్‌లను శాశ్వతంగా పిన్ చేయడం, మెన్‌షన్ చేసిన మెసేజ్‌లను ప్రత్యేకంగా చూడటం, గ్రూప్ సభ్యుల కోసం ప్రత్యేక స్టేటస్ పెట్టడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

Venkat
Published on: 30 Oct 2026 8:10 PM IST
WhatsApp New Features
X

WhatsApp New Features: వాట్సాప్ గ్రూపుల్లో అదిరిపోయే 4 కొత్త ఫీచర్లు.. ఇక మెసేజ్‌లు ఎప్పటికీ..!

WhatsApp New Features: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ గ్రూప్ చాట్స్ విషయంలో కీలక మార్పులు చేస్తోంది. కొత్తగా గ్రూప్‌లో చేరిన సభ్యులు గత సంభాషణలను సులభంగా తెలుసుకునేలా కొత్త సదుపాయాన్ని తీసుకొస్తోంది. అలాగే గ్రూప్‌లో ముఖ్యమైన సమాచారాన్ని ఎక్కువ కాలం అందుబాటులో ఉంచేందుకు మెసేజ్ పిన్ ఫీచర్‌లోనూ మార్పులు చేసింది.

ఇక మెసేజ్‌లు శాశ్వతంగా పిన్‌..

ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌లో గరిష్ఠంగా నాలుగు మెసేజ్‌లను పిన్ చేసుకునే అవకాశం ఉంది. వీటిని 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు పిన్ చేయవచ్చు. కొత్త అప్‌డేట్‌తో ముఖ్యమైన మెసేజ్‌ను ఎప్పటికీ పిన్ చేసి ఉంచే అవకాశం రానుంది. దీంతో గ్రూప్‌లో ముఖ్యమైన నిబంధనలు, సమాచారం లేదా ప్రకటనలను సభ్యులు తర్వాత కూడా సులభంగా చూసుకోవచ్చు.

కొత్త సభ్యులకు పాత చాట్ హిస్టరీ..

గ్రూప్‌లో కొత్తగా చేరిన సభ్యులకు గతంలో జరిగిన సంభాషణలను షేర్ చేసే అవకాశం కూడా అందుబాటులోకి వస్తోంది. గ్రూప్ అడ్మిన్‌లు లేదా ఇతర మేనేజర్లు ఇటీవల చేరిన సభ్యుడి పేరుపై ట్యాప్ చేసి, అతనికి లేదా ఆమెకు ఇటీవలి మెసేజ్‌లను పంపవచ్చు. ఈ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షించబడతాయని వాట్సాప్‌ తెలిపింది.

గతంలో కొత్త సభ్యుడిని గ్రూప్‌లో చేర్చే సమయంలోనే చాట్ హిస్టరీని షేర్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సమయంలో మిస్ అయినా, తర్వాత కూడా అవసరమైన పాత మెసేజ్‌లను షేర్ చేయవచ్చు.

మెన్‌షన్ చేసిన మెసేజ్‌లు ప్రత్యేకంగా..

గ్రూప్‌లో మన పేరును ఎవరైనా మెన్‌షన్ చేసినప్పుడు ఆ మెసేజ్‌ను సులభంగా గుర్తించేందుకు కొత్త ఫిల్టర్ కూడా వస్తోంది. ఈ ఫిల్టర్‌ను ఉపయోగిస్తే మనలను ట్యాగ్ చేసిన మెసేజ్‌లను మాత్రమే ప్రత్యేకంగా చూడవచ్చు. ఎక్కువ మంది సభ్యులు ఉన్న గ్రూపుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది.

గ్రూప్ సభ్యుల కోసం ప్రత్యేక స్టేటస్..

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌గా గ్రూప్ స్టేటస్‌ను కూడా తీసుకొస్తోంది. ఇందులో స్టేటస్‌ను అందరికీ కాకుండా నిర్దిష్ట గ్రూప్ సభ్యులకు మాత్రమే షేర్ చేయవచ్చు. సాధారణ స్టేటస్‌ల మాదిరిగానే ఇవి 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. గ్రూప్‌లోని ఇతర సభ్యులు ఆ స్టేటస్‌కు రియాక్ట్ చేయడంతో పాటు తమ స్టేటస్‌ను కూడా జోడించవచ్చు.

ఈ నాలుగు మార్పులతో గ్రూప్ చాట్స్‌లో పాత సంభాషణలను తెలుసుకోవడం, ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచడం మరింత సులభం కానుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.