WhatsApp Guest Calls: వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్ లాంచ్.. ఇకపై యాప్, అకౌంట్ లేకుండానే..!

WhatsApp Guest Calls: యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని వాట్సప్ ఇందులో అప్రూవల్ ప్రక్రియను కూడా అందించింది. అంటే ఎవరికైనా వారి అనుమతి లేకుండా వాట్సప్ గెస్ట్ కాల్‌లో చేర్చడం సాధ్యం కాదు.

Venkat
Published on: 16 Oct 2026 10:56 AM IST
WhatsApp Guest Calls
X

WhatsApp Guest Calls: వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్ లాంచ్.. ఇకపై యాప్, అకౌంట్ లేకుండానే..!

WhatsApp Guest Calls: వాట్సప్ ఇప్పటివరకు తీసుకొచ్చిన ముఖ్యమైన ఫీచర్లలో ఒకటైన గస్ట్ కాల్స్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో వాట్సప్ యూజర్లు వాట్సప్ ఉపయోగించని వారితో కూడా కాల్స్ మాట్లాడవచ్చు. ముఖ్యంగా వారి ఫోన్‌లో వాట్సప్ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉండాల్సిన అవసరం లేదు. వాట్సప్ అకౌంట్ కూడా అవసరం లేదు. ఈ కాల్స్ పూర్తిగా ఉచితం.

వాట్సప్ తీసుకొచ్చిన గెస్ట్ కాల్స్ ఫీచర్ ద్వారా యాప్ లేని మొబైల్ యూజర్లతో కూడా వాట్సప్ కాల్స్ చేయవచ్చు. గెస్ట్ కాల్ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. భద్రత కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. అలాగే కాల్‌కు ప్రత్యేకమైన టైమ్ లిమిట్ ఉండదు. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

గెస్ట్ కాల్స్ ఫీచర్‌ను వాట్సప్ ఇటీవల పరీక్షిస్తున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు కొన్ని వారాల తర్వాత దీన్ని అధికారికంగా విడుదల చేసింది. టెస్టింగ్ సమయంలోనే గెస్ట్ యూజర్‌‌కు ప్రత్యేకమైన లింక్ పంపుతారని వెల్లడైంది. ఆ లింక్ ద్వారా వాట్సప్ యాప్ డౌన్‌లోడ్ చేయకుండానే కాల్‌లో చేరవచ్చు.

ప్రైవసీకి ప్రాధాన్యం..

యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని వాట్సప్ ఇందులో అప్రూవల్ ప్రక్రియను కూడా అందించింది. అంటే ఎవరికైనా వారి అనుమతి లేకుండా వాట్సప్ గెస్ట్ కాల్‌లో చేర్చడం సాధ్యం కాదు.

గెస్ట్ కాల్ కోసం ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ అందుకున్న వ్యక్తి కావాలనుకుంటే కాల్‌లో చేరవచ్చు. లేకపోతే ఆ మెసేజ్‌ను పట్టించుకోకుండా వదిలేయవచ్చు. గెస్ట్ కాల్ లింక్‌ను రూపొందించిన వాట్సప్ యూజర్ ప్రతి గెస్ట్‌ను కాల్‌లో చేర్చే ముందు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది.

వాట్సప్ ‌గెస్ట్ కాల్‌లో టైమ్ లిమిట్ లేదు..

వాట్సప్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా గెస్ట్ కాలింగ్ ఫీచర్ గురించి వెల్లడించింది. ఈ సదుపాయం పూర్తిగా ఉచితంగా ఉంటుంది. కాల్‌కు ప్రత్యేకమైన సమయ పరిమితి ఉండదు. అలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కూడా ఉంటుంది.గెస్ట్ కాల్ లింక్‌ను వాట్సప్ యూజర్ మాత్రమే జనరేట్ చేయగలరు. ఆ లింక్‌ను ఇతరులతో షేర్ చేసిన తర్వాత వారు దాని ద్వారా కాల్‌లో చేరవచ్చు.

వాట్సప్ గెస్ట్ కాల్ ఎలా చేయాలి..?

రాబోయే రోజుల్లో వాట్సప్ “గెస్ట్ కాల్స్ ఫర్ పీపుల్ విత్ ఔట్ ఎన్ అకౌంట్” అనే ఆప్షన్ కనిపించవచ్చు. అయితే ఈ ఫీచర్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై అధికారికంగా పూర్తి సమాచారం లేదు.

వాట్సప్ గెస్ట్ కాల్ చేయడానికి:

ముందుగా వాట్సప్ లోని కాల్స్ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత ‘+’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఒక కాల్ లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్‌ను గెస్ట్ యూజర్లతో షేర్ చేయాలి. గెస్ట్ కాల్స్ ఫీచర్ వ్యక్తిగత కాల్స్‌తో పాటు గ్రూప్ కాల్స్‌కు కూడా ఉపయోగపడుతుంది.

వాట్సప్ గెస్ట్ కాల్స్ ద్వారా కాల్‌లో చేరే యూజర్లకు వాట్సప్ సాధారణ కాల్స్‌లో అందించే అనేక ఫీచర్లు లభిస్తాయి. ఉదాహరణకు స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే కాల్ సమయంలో ఎమోజీల ద్వారా రియాక్షన్ ఇవ్వవచ్చు.

గెస్ట్ కాల్ లో ఎప్పుడైనా గెస్ట్‌ను రిమూవ్ చేయవచ్చు..

వాట్సప్ లో కాల్ లింక్ జనరేట్ చేసిన యూజర్ ప్రతి గెస్ట్‌ను కాల్‌లో చేర్చే ముందు అప్రూవల్ ఇవ్వాలి. వాట్సప్ యాప్ డౌన్‌లోడ్ చేయకుండా కాల్‌లో చేరే ప్రతి వ్యక్తికి ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే గెస్ట్ కాల్ సమయంలో అవసరమైతే ఇప్పటికే కాల్‌లో చేరిన గెస్ట్‌ను ఎప్పుడైనా రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.