WhatsApp: వాట్సాప్ హ్యాక్ అయిందా.? ఇలా ఈజీగా రికవర్ చేయండి
WhatsApp: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? కంగారు పడకండి. కేవలం ఒక సీక్రెట్ కోడ్ డయల్ చేయడం ద్వారా మీ అకౌంట్‌ను వెంటనే తిరిగి ఎలా పొందాలో ఢిల్లీ పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణులు వివరించారు.
WhatsApp: వాట్సాప్ హ్యాక్ అయిందా.? ఇలా ఈజీగా రికవర్ చేయండి
WhatsApp: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? కంగారు పడకండి. కేవలం ఒక సీక్రెట్ కోడ్ డయల్ చేయడం ద్వారా మీ అకౌంట్‌ను వెంటనే తిరిగి ఎలా పొందాలో ఢిల్లీ పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణులు వివరించారు. ఆ ముఖ్యమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి
ప్రస్తుత డిజిటల్ యుగంలో వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ సాధనంగా మారిపోయింది. ఒకవేళ మీ వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల చేతికి చిక్కితే క్షణాల్లో మీ వ్యక్తిగత సమాచారం మొత్తం ప్రమాదంలో పడుతుంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీ అకౌంట్‌ను వెంటనే తిరిగి పొందడానికి ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం, సైబర్ దోస్త్ ఒక 'సీక్రెట్ కోడ్' ట్రిక్‌ను వెల్లడించారు.
సాధారణంగా హ్యాకర్లు మీ వాట్సాప్‌ను హ్యాక్ చేయడానికి కాల్ ఫార్వార్డింగ్ లేదా మెసేజ్ ఫార్వార్డింగ్ ట్రిక్స్‌ను ఉపయోగిస్తారు. మీకు తెలియకుండానే వెరిఫికేషన్ కోడ్‌లు వారికి వెళ్లిపోయేలా చేస్తారు. దీనిని అడ్డుకోవడానికి వెంటనే మీ మొబైల్ కీప్యాడ్ ఓపెన్ చేసి *##21#* అనే సీక్రెట్ USSD కోడ్‌ను డయల్ చేయాలి. ఇలా డయల్ చేసిన వెంటనే మీ ఫోన్ నంబర్‌పై ఉన్న అన్ని రకాల కాల్, మెసేజ్ ఫార్వార్డింగ్ సేవలు వెంటనే డిసేబుల్ అయిపోతాయి.
కాల్ ఫార్వార్డింగ్ కట్ అవ్వగానే, మీ వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్‌లు నేరుగా మీ ఫోన్‌కే వస్తాయి. తద్వారా హ్యాకర్ల నుంచి మీ అకౌంట్‌ను సులభంగా మీ చేతిలోకి తెచ్చుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా ఉండాలంటే మీ వాట్సాప్‌లో 'టూ-స్టెప్ వెరిఫికేషన్' ఆన్ చేసుకుని ఒక పర్సనల్ పిన్ సెట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరో పంపిన అనుమానాస్పద లింక్స్‌ను క్లిక్ చేయొద్దని, అలాగే మీ ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




