WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ మెసేజ్‌లన్నీ క్షణాల్లోనే మాయం..!
WhatsApp New Feature 2026: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచార రక్షణ కోసం సరికొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ మెసేజ్‌లన్నీ క్షణాల్లోనే మాయం..!
WhatsApp New Feature 2026: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న వాట్సాప్, వినియోగదారుల గోప్యతను మరింత పటిష్టం చేయడానికి నిరంతరం కొత్త అప్‌డేట్‌లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డిసప్పియరింగ్ మెసేజెస్ విధానాన్ని పూర్తిగా మార్చేసేలా ఒక సరికొత్త ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది. దీని ద్వారా మనం పంపే కీలక డాక్యుమెంట్లు లేదా రహస్య సమాచారంపై మనకు పూర్తి నియంత్రణ లభిస్తుంది.
మెసేజ్ చూసిన తర్వాతే అసలు కథ మొదలు..
ప్రస్తుతం వాట్సాప్‌లో ఉన్న నిబంధన ప్రకారం.. మనం పంపిన సమయం నుంచి మాత్రమే మెసేజ్ డిలీట్ అయ్యే సమయం లెక్కించబడుతుంది. అవతలి వ్యక్తి చూసినా చూడకపోయినా ఆ సమయం ముగియగానే మెసేజ్ మాయమవుతుంది. కానీ ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం, అవతలి వ్యక్తి ఆ మెసేజ్‌ను ఓపెన్ చేసినప్పటి నుంచి సమయం లెక్కించబడుతుంది. అంతవరకు ఆ సమాచారం చాట్‌లో సురక్షితంగా ఉంటుంది.
ఎలా పని చేస్తుంది..
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు టైం సెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అవతలి వ్యక్తి మెసేజ్ చదివిన తర్వాత అది ఎంత సమయంలోగా డిలీట్ అవ్వాలో మనమే నిర్ణయించవచ్చు. దీని కోసం 5 నిమిషాలు, ఒక గంట, 12 గంటలు ఇలా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం 5 నిమిషాల సమయాన్ని ఎంచుకుంటే, అవతలి వ్యక్తి ఆ మెసేజ్ చదివిన 5 నిమిషాల్లోనే అది చాట్ నుంచి శాశ్వతంగా తొలగించబడుతుంది.
సేఫ్టీకి డబుల్ లాక్..
ఈ ఫీచర్‌లో వాట్సాప్ మరో అదనపు భద్రతా నిబంధనను కూడా చేర్చింది. ఒకవేళ మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి 24 గంటల వరకు ఓపెన్ చేయకపోతే, అది చదవకుండానే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. దీనివల్ల పాత మెసేజ్ లు ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం తప్పుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వినియోగదారుల పరిశీలనలో ఉంది. త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి రానుంది. ఇది డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. అవసరమైన వారు ప్రతి చాట్‌కు విడివిడిగా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు.
📝 WhatsApp beta for iOS 26.19.10.72: what's new?
— WABetaInfo (@WABetaInfo) May 15, 2026
WhatsApp is rolling out a feature that makes new messages disappear after they're read, and it's available to some beta testers!https://t.co/xVxVk23N44 pic.twitter.com/Xva6fO9wWO




