WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు వచ్చేసిన షెడ్యూల్డ్ మెసేజ్ ఫీచర్!

WhatsApp: వాట్సప్‌లో కొత్తగా వచ్చిన షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్ ద్వారా 10 నిమిషాల నుంచి 2 వారాల ముందుగానే మెసేజ్‌లను సెట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రత్యేకతలు, సెట్ చేసే విధానం తెలుసుకోండి.

Arun Chilukuri
Published on: 25 Nov 2026 5:51 PM IST
WhatsApp
X

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు వచ్చేసిన షెడ్యూల్డ్ మెసేజ్ ఫీచర్!

WhatsApp: వాట్సప్ (WhatsApp) యూజర్లకు కంపెనీ శుభవార్త అందించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లు లేదా రిమైండర్లతో పనిలేకుండానే, తాము పంపాలనుకుంటున్న మెసేజ్‌లను ముందుగానే సెట్ చేసుకోవచ్చు. నిర్ణీత సమయానికి ఆ సందేశాలు ఆటోమేటిక్‌గా అవతలి వారికి డెలివరీ అవుతాయి. వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది.

ఈ ఫీచర్ ముఖ్య విశేషాలు ఇవే:

ప్రస్తుత సమయం నుంచి కనీసం 10 నిమిషాల తర్వాత మొదలుకొని, గరిష్ఠంగా రెండు వారాల (14 రోజుల) వరకు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంది. మీరు సెట్ చేసిన సమయానికి ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా లేదా వాట్సప్ క్లోజ్ చేసి ఉన్నా సరే, మెసేజ్ ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతుంది.

ఏమేం షెడ్యూల్ చేయొచ్చు?: టెక్స్ట్ మెసేజ్‌లు, లింకులు, ఫొటోలు, వీడియోలను షెడ్యూల్ చేయవచ్చు. వీటన్నింటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది. అయితే, ప్రస్తుతం డాక్యుమెంట్లను షెడ్యూల్ చేసే సదుపాయం లేదు.

షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు డెలివరీ కాకముందు చాట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లో వాటిని చూడొచ్చు. ఇందుకోసం చాట్‌లోనే ప్రత్యేక సెక్షన్ ఉంటుంది. అవసరం లేదనుకుంటే వాటిని డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది.

గ్రూప్‌లో ఒక మెసేజ్‌ను షెడ్యూల్ చేసినప్పుడు, ఆ మెసేజ్ డెలివరీ అయ్యే సమయానికి గ్రూప్‌లో ఉన్న సభ్యులకు మాత్రమే అది వెళ్తుంది. ఆ తర్వాత కొత్తగా గ్రూప్‌లో చేరే సభ్యులకు ఆ షెడ్యూల్డ్ మెసేజ్ కనిపించదు. ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లలో కొందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

షెడ్యూల్డ్ మెసేజ్ సెట్ చేయడం ఇలా:

ముందుగా ఏదైనా చాట్ ఓపెన్ చేసి అందులో టెక్స్ట్ లేదా మీడియా ఫైల్‌ను జత చేయాలి.

ఆ తర్వాత ‘సెండ్’ (Send) బటన్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి.

అప్పుడు తేదీ, డెలివరీ సమయాన్ని ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

షెడ్యూల్ చేసిన తర్వాత చాట్‌లోనే షెడ్యూల్డ్ మెసేజెస్ కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో షెడ్యూల్ చేసిన మెసేజ్‌ల వివరాలు ఉంటాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.