ChatGPT Tips: చాట్‌జీపీటీలో చాట్ డిలీట్ కొట్టేస్తే అది ఎక్కడికి పారిపోతుంది? తిరిగి వస్తుందా లేదా?
ChatGPT Tips: ప్రతిరోజూ కోట్లాది మంది వినియోగదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్‌జీపీటీని ఉపయోగిస్తుంటారు.
ChatGPT Tips
ChatGPT Tips: ప్రతిరోజూ కోట్లాది మంది వినియోగదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్‌జీపీటీని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఎన్నో రకాల విషయాలపై చర్చలు జరుపుతుంటాం. అయితే కొన్ని చాట్‌లను మనం అలాగే ఉంచుకోవాలని చూస్తే, మరికొన్నింటిని వెంటనే డిలీట్ చేయాలని భావిస్తాం. చాట్‌జీపీటీలో డిలీట్, ఆర్కైవ్ అనే రెండు వేర్వేరు ఆప్షన్లు ఉంటాయి. కానీ వీటి మధ్య తేడా ఏమిటి? చాట్ డిలీట్ చేసిన తర్వాత ఆ డేటా ఏమవుతుంది? మళ్లీ దాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చా లేదా అనే దానిపై చాలా మందిలో అయోమయం ఉంటుంది. ఈ విషయాలపై ఓపెన్‌ఏఐ స్పష్టమైన వివరాలు అందించింది.
చాట్‌జీపీటీలో చాట్ డిలీట్ చేయడం ఎలా?
చాట్‌జీపీటీ హిస్టరీలో మీరు ఏ చాట్‌నైతే తొలగించాలనుకుంటున్నారో, ముందుగా సైడ్‌బార్‌లో ఆ చాట్ పేరును వెతకాలి. ఆ చాట్ పేరు పక్కనే ఉండే మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఆప్షన్లలో Delete ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే, ఆ చాట్ మీ హిస్టరీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది. ఎక్కడా కనిపించదు.
చాట్ డిలీట్ చేస్తే ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది?
చాట్‌జీపీటీలో ఏదైనా చాట్‌ను డిలీట్ చేసిన వెంటనే అది మీ స్క్రీన్ లేదా హిస్టరీ నుంచి మాయమవుతుంది. ఓపెన్‌ఏఐ నిబంధనల ప్రకారం, డిలీట్ చేసిన చాట్‌లను 30 రోజుల లోపు సిస్టమ్ నుంచి శాశ్వతంగా తొలగించడానికి షెడ్యూల్ చేస్తారు. ఒకసారి చాట్ డిలీట్ అయిపోతే దాన్ని చాట్‌జీపీటీ ఇంటర్‌ఫేస్, ఏపీఐ లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా కూడా తిరిగి రికవర్ చేయడం అసాధ్యం. అయితే, కొన్నిసార్లు చాట్ కనిపించకపోతే అది డిలీట్ అయిందని అనుకోకూడదు, అది పొరపాటున ఆర్కైవ్ అయి ఉండవచ్చు.
ఆర్కైవ్ చేసిన చాట్‌లను ఎలా చూడాలి?
ఆర్కైవ్ చేసిన చాట్‌లు మీ అకౌంట్‌లో సురక్షితంగానే ఉంటాయి. వాటిని చూడటానికి ముందుగా చాట్‌జీపీటీ Settings ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Data controls సెక్షన్‌కు వెళ్లి, Archived chats పక్కన ఉండే Manage ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ మీరు గతంలో ఆర్కైవ్ చేసిన అన్ని చాట్‌లు కనిపిస్తాయి. ఒకవేళ ఆ చాట్ మీకు మళ్లీ కావాలనుకుంటే Unarchive ఆప్షన్‌ను ఉపయోగించి దాన్ని యథావిధిగా మీ మెయిన్ హిస్టరీలోకి తెచ్చుకోవచ్చు.
ముఖ్యమైన చాట్‌లను భద్రపరుచుకోవడం ఎలా?
మీకు అత్యంత ముఖ్యమైన చాట్‌లు పోకూడదని భావిస్తే వాటిని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం చాట్‌జీపీటీ Settings ఓపెన్ చేసి, Data controls సెక్షన్‌లోకి వెళ్లి Export data ఆప్షన్ ద్వారా మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. చాట్ ఒకసారి పర్మినెంట్‌గా డిలీట్ అయిపోతే మాత్రం దాన్ని మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం ఎవరివల్లూ కాదు.




