Remote Hacks: చేతితో కొట్టిన వెంటనే రిమోట్ ఎందుకు పనిచేస్తుంది.. 90 శాతం మందికి తెలియని సీక్రెట్..!
Why Hitting Remote Works: సరదాగా టీవీ చూద్దామని రిమోట్ నొక్కితో అది మొరాయించడం మనకు తెలిసిందే. దీంతో వెంటనే మన చేతితో గట్టిగా ఒక్కటి ఇస్తే, దారికొస్తుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా..? దీని వెనుక ఓ రీజన్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Remote Hacks: చేతితో కొట్టిన వెంటనే రిమోట్ ఎందుకు పనిచేస్తుంది.. 90 శాతం మందికి తెలియని సీక్రెట్..!
Why Hitting Remote Works: టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ అకస్మాత్తుగా ఆగిపోతే, మనలో చాలామంది చేసే మొదటి పని దానిని అరచేతితో గట్టిగా కొట్టడం. విచిత్రంగా ఆ దెబ్బతో రిమోట్ మళ్ళీ పని చేయడం ప్రారంభిస్తుంది. ఇది కేవలం యాదృచ్చికం అనుకుంటే పొరపాటే. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉందండోయ్. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మనం టీవీ లేదా ఏసీ రిమోట్‌లను చాలా కాలం పాటు ఉపయోగిస్తున్నప్పుడు, బ్యాటరీలకు, రిమోట్ లోపల ఉండే లోహపు పాయింట్లకు మధ్య ఒక రకమైన అదృశ్య పొర ఏర్పడుతుంది. దీనిని శాస్త్రీయ పరిభాషలో 'ఆక్సిడేషన్' అని పిలుస్తారు. గాలిలోని తేమ వల్ల బ్యాటరీ టెర్మినల్స్ వద్ద స్వల్పంగా తుప్పు పట్టడం లేదా ఒక రకమైన ఆక్సైడ్ పొర పేరుకుపోవడం జరుగుతుంది. ఇది బ్యాటరీ నుంచి విద్యుత్ ప్రవాహాన్ని రిమోట్ సర్క్యూట్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
మనం రిమోట్‌ను అరచేతితో కొట్టినప్పుడు లేదా తట్టినప్పుడు కలిగే ప్రకంపనల వల్ల ఆ ఆక్సైడ్ పొర స్వల్పంగా తొలగిపోతుంది. దీనివల్ల బ్యాటరీకి, రిమోట్ పాయింట్లకు మధ్య సంబంధం మళ్ళీ ఏర్పడి, విద్యుత్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. అందుకే ఆగిపోయిన రిమోట్ కొట్టిన వెంటనే మళ్ళీ పనిచేస్తుందన్నమాట.
బ్యాటరీలను రుద్దడం వెనుక ఉన్న మతలబు..
చాలామంది బ్యాటరీలను తీసి దుస్తులపై రుద్ది మళ్ళీ పెడుతుంటారు. దీనిని సాంకేతికంగా 'రీ-సీటింగ్' అంటారు. బ్యాటరీలను తీసి మళ్ళీ పెట్టడం వల్ల టెర్మినల్స్ శుభ్రపడతాయి. అంతేకాకుండా, బ్యాటరీలను రుద్దడం వల్ల ఉత్పన్నమయ్యే 'స్టాటిక్ ఎనర్జీ' బలహీనపడిన బ్యాటరీకి స్వల్ప శక్తిని ఇస్తుంది. రిమోట్ వంటి పరికరాలకు చాలా తక్కువ విద్యుత్ అవసరం కాబట్టి, ఆ చిన్నపాటి శక్తితోనే అది మళ్ళీ పని చేస్తుంది.
ముందు జాగ్రత్తలు..
రిమోట్‌ను గట్టిగా కొట్టడం వల్ల కొన్నిసార్లు లోపల ఉండే చిన్న చిన్న భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, కొట్టే బదులు బ్యాటరీలను తీసి వాటి టెర్మినల్స్‌ను పొడి బట్టతో శుభ్రం చేయడం ఉత్తమ పద్ధతి. అలాగే, చలికాలంలో ఏసీ రిమోట్ వంటి తక్కువగా వాడే పరికరాల నుంచి బ్యాటరీలను తీసి విడిగా ఉంచడం మంచిది. దీనివల్ల ఆక్సిడేషన్ సమస్య ఉండదు. బ్యాటరీలు లీక్ అవ్వకుండా రిమోట్ సురక్షితంగా ఉంటుంది.
మీ గ్యాడ్జెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే బ్యాటరీ పాయింట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీరు రిమోట్‌పై ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉండదు.




