Old Phone: పాత ఫోన్ అమ్మాలనుకుంటారు.? కానీ.! సీక్రెట్స్ ఇతరుల చేతికి

Old Phone: దేశంలో చాలా మంది తమ పాత స్మార్ట్‌ఫోన్లను అమ్ముకోవాలంటే భయపడుతున్నారని 'క్యాషిఫై' సర్వేలో తేలింది.

Ravi
By Ravi
Published on: 21 Jun 2026 3:05 PM IST
Old Phone
X

Old Phone: పాత ఫోన్ అమ్మాలనుకుంటారు.? కానీ.! సీక్రెట్స్ ఇతరుల చేతికి

Old Phone: ప్రస్తుత రోజుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం ఎంత సాధారణమో, పాత ఫోన్‌ను పక్కన పడేయడం లేదా అమ్ముకోవడం కూడా అంతే సాధారణంగా మారిపోయింది. అయితే, ఎంతో డబ్బులు పెట్టి కొన్న పాత స్మార్ట్‌ఫోన్లను సెకండ్ హ్యాండ్‌లో అమ్ముకోవాలంటే దేశంలో చాలా మంది తీవ్రంగా భయపడుతున్నారని ప్రముఖ ప్లాట్‌ఫామ్ 'క్యాషిఫై' నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఫోన్ అమ్మేస్తే తమ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కుతుందనే భయమే ఇందుకు ప్రధాన కారణమని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.

క్యాషిఫై సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మంది మొబైల్ వినియోగదారులపై ఈ ప్రత్యేక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం, ఏకంగా 70 శాతం మంది ప్రజలు కేవలం డేటా భద్రతపై ఉన్న ఆందోళన కారణంగానే తమ పాత స్మార్ట్‌ఫోన్లను అమ్ముకోకుండా తమ వద్దే ఉంచుకుంటున్నారని తెలిసింది. తమ పాత ఫోన్‌ను ఎవరికైనా విక్రయిస్తే అందులోని ఫోటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, ఇతర వ్యక్తిగత డేటా కచ్చితంగా దుర్వినియోగం అవుతుందని ప్రతి నలుగురిలో ముగ్గురు బలంగా భావిస్తున్నారని ఈ సర్వే పేర్కొంది.

సాధారణంగా ఎవరైనా ఫోన్ అమ్మే ముందు తమ డేటాను తొలగించడానికి 'ఫ్యాక్టరీ రీసెట్' చేస్తుంటారు. కానీ, ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా మొబైల్ నుంచి తమ సమాచారం మొత్తం పూర్తిగా డిలీట్ కాదని 41 శాతం మంది వినియోగదారులు చెబుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఆధునిక సాఫ్ట్‌వేర్ల ద్వారా రీసెట్ చేసిన ఫోన్ల నుంచి కూడా కొంత డేటాను రికవరీ చేసే అవకాశం ఉండటంతోనే ప్రజల్లో ఈ భయం నెలకొందని నిపుణులు అంటున్నారు. కాబట్టి పాత ఫోన్లను ఇతరులకు అమ్మేటప్పుడు నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఫోన్లను విక్రయించడం సురక్షితమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story