iPhone: ఐఫోన్ లో ఎప్పుడూ 9:41 టైమ్ ఎందుకు కనిపిస్తుంది.. ఆ రహస్యం ఏంటో తెలుసా?
iPhone 9:41 Time Reason: ఐఫోన్ 17 అయినా, మొదటి ఐఫోన్ అయినా యాపిల్ ప్రకటనల్లో ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారదు. అదే స్క్రీన్‌పై కనిపించే 9:41 టైమ్. ఈ చిన్న డిటైల్ వెనుక ఓ హిస్టరీ దాగి ఉంది. యాపిల్ స్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు సంబంధించిన ఈ సీక్రెట్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తి రేపుతోంది.
iPhone: ఐఫోన్ లో ఎప్పుడూ 9:41 టైమ్ ఎందుకు కనిపిస్తుంది.. ఆ రహస్యం ఏంటో తెలుసా?
iPhone 9:41 Time Reason: యాపిల్ (Apple) కంపెనీ 2026 ఏప్రిల్ 1న తన 50వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోనుంది. చిన్న గ్యారేజ్‌లో ప్రారంభమైన ఈ సంస్థ, ప్రపంచంలోనే అగ్రగామి టెక్ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. యాపిల్ విజయానికి కారణం కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. డిజైన్, ప్రైవసీ, యూజర్ అనుభవం ఇలా అన్నీ కలిసి ఒక బ్రాండ్‌ను స్టేటస్ సింబల్‌గా మార్చాయి.
ఐఫోన్ (iPhone)లో 9:41 టైమ్ రహస్యం ఏమిటి?
యాపిల్ ఉత్పత్తుల ప్రకటనల్లో, వెబ్సైట్లో లేదా పోస్టర్లలో ఐఫోన్ స్క్రీన్‌పై ఎప్పుడూ 9:41 AM టైమ్ కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ టైమ్ వెనుక ఉన్న కథ 2007లో జరిగిన మొదటి యాపిల్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించినది.
స్టీవ్ జాబ్స్ ప్రెజెంటేషన్‌తో ఉన్న కనెక్షన్..
2007లో జరిగిన మ్యాక్ వరల్డ్ ఈవెంట్లో స్టీవ్ జాబ్స్ మొదటి ఐఫోన్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ ప్రెజెంటేషన్‌ను ఖచ్చితంగా టైమ్ చేశారు. ఈవెంట్ ప్రారంభమైన 40 నిమిషాల తర్వాత అంటే ఉదయం 9:41కి ఐఫోన్ స్క్రీన్‌పై చూపిస్తున్నారు.
ప్రేక్షకులు చూస్తున్న పెద్ద స్క్రీన్ టైమ్, ఐఫోన్ స్క్రీన్ టైమ్ రెండూ ఒకేలా ఉండేలా ప్లాన్ చేశారు. ఆ క్షణం టెక్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పటి నుంచి యాపిల్ ప్రతి ఐఫోన్ ప్రకటనలో అదే 9:41 టైమ్‌ను కొనసాగిస్తోంది.
ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారింది?
ఇప్పటి స్మార్ట్ఫోన్లు జీపీఎస్ శాటిలైట్స్, మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా ఆటోమేటిక్‌గా సరిగ్గా టైమ్ సెట్ చేసుకుంటాయి. టైమ్ జోన్ మారినా, డేలైట్ సేవింగ్ వంటి మార్పులు వచ్చినా ఫోన్ స్వయంగా అడ్జస్ట్ అవుతుంది. అంటే, ఇప్పుడు ఈ టైమ్ సెట్ చేయడానికి ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఐఫోన్ లో 9:41 టైమ్ కేవలం ఒక నంబర్ కాదు యాపిల్ చరిత్రలో ఒక గుర్తుండిపోయే క్షణానికి ప్రతీక. చిన్న డిటైల్ అయినా, దాని వెనుక ఉన్న ఆలోచన యాపిల్ బ్రాండ్ ప్రత్యేకతను మరింత బలపరుస్తుంది.




